మ‌ళ్లీ బాలీవుడ్ బొక్క బోర్లాప‌డిందిగా!

Update: 2022-07-22 16:30 GMT
బాలీవుడ్ మ‌ళ్లీ బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డింది. పులిని చూసి న‌క్క వాత‌లు పెట్టుకుంద‌న్న చందంగా `బాహుబ‌లి`ని చూసి ఆ రేంజ్ సినిమాతో సౌత్ ని స‌వాల్ చేయాల‌ని, మ‌ళ్లీ త‌న స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నం చేసి మ‌ళ్లీ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. మ‌న సినిమాల స్ఫూర్తితో పీరియాడిక్ నేప‌థ్యంలో రూపొందిన బాలీవుడ్ మూవీ `షంషేరా`. స్టార్ హీరోగా బాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న ర‌ణ్ బీర్ క‌పూర్ ఈ సినిమాలో హీరోగా న‌టించాడు.

నాలుగేళ్ల క్రితం `సంజు` సినిమాతో ర‌ణ్ బీర్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. బాలీవుడ్ బ్యాడ్ మెన్ సంజ‌య్ ద‌త్ జీవిత క‌థ ఆధారంగా రాజ్ కుమార్ హిరాణీ రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. హీరోగా ర‌ణ్ బీర్ పై ప్ర‌శంస‌లు కురిపించింది. 2018 జ‌న‌వ‌రి 29ర విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర‌ల్డ్ వైడ్ గా 500 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో అక్ష‌య్ కుమార్ త‌రువాత బాలీవుడ్ లో ఖాన్ త్ర‌యానికి గ‌ట్టి పోటీనిచ్చిన హీరోగా ర‌ణ్ బీర్ నిలిచాడు. దీంతో స్టార్ మేక‌ర్స్ దృష్టి ర‌ణ్ బీర్ పై ప‌డింది.

ఈ నేప‌థ్యంలో అత‌నితో వంద‌ల కోట్ల బ‌డ్జెట్ ల‌తో సినిమాలు నిర్మించ‌డం మొద‌లు పెట్టారు. అందులో భాగంగా ముందు విడుద‌లైన మూవీ `షంషేరా`. బాలీవుడ్ లో పేరుమోసిన ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. క‌ర‌ణ్ మ‌ల్హోత్రా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ తో అంచ‌నాల్ని క్రియేట్ చేసింది. భారీ మేకింగ్ వ్యాల్యూస్ తో రూ. 150 కోట్ల‌తో ఈ మూవీని నిర్మించారు.

దేశ వ్యాప్తంగా శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమాపై బాలీవుడ్ భారీ ఆశ‌లు పెట్టుకుంది. ఈ మూవీతో అయినా బ్లాక్ బ‌స్ట‌ర్ ల ప‌రంప‌ర మ‌ళ్లీ మొద‌ల‌వుతుంద‌ని ఆశ‌గా యావ‌త్ బాలీవుడ్‌ ఎదురుచూసింది. కానీ మ‌రోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. దేశ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ విష‌యంలోనే షాకిచ్చిన `షంషేరా` ఓపెనింగ్స్ ప‌రంగా, టాక్ ప‌రంగా షాకిచ్చింది. బాలీవుడ్ లో ఈ మూవీ మ‌రో డిజాస్ట‌ర్ గా నిల‌వ‌బోతోంద‌ని తెలుస్తోంది.

బాలీవుడ్ క్రిటిక్స్‌, నెటిజ‌న్స్ నెట్టింటిగా ఈ మూవీపై ఘాటుగా స్పందిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ప్ర‌ముఖ బాలీవుడ్ క్రిటిక్ అయితే న‌మ్మ‌లేక‌పోతున్నా అంటూనే 1.2 రేటింగ్ ని అందించాడంటే ఈ మూవీ ఏ స్థాయి డిజాస్ట‌ర్ గా నిలిచిందో అర్థం చేసుకోవ‌చ్చు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, అమీర్‌ఖాన్ న‌టించిన `థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్` మూవీని గుర్తు చేసింద‌ని, ర‌ణ్ బీర్ క‌పూర్ స్టార్ డ‌మ్ కూఐడా ఈ మూవీని కాపాడ‌లేక‌పోయింద‌ని, ఎపిక్ డిజ‌ప్పాయింట్ మెంట్ అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ర‌ణ్ బీర్ పెర్ఫార్మెన్స్ మిన‌హాయిస్తే సినిమాలో ఏమీ లేద‌ని ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ మ‌ల్హొత్రా దారుణంగా నిరుత్సాహ ప‌రిచాడ‌ని కామెంట్ లు వినిపిస్తున్నాయి. అక్ష‌య్ కుమార్ `సామ్రాట్ పృథ్వీరాజ్‌` త‌రువాత `షంషేరా` రూపంలో బాలీవుడ్ కు  బిగ్ షాక్ అని విమ‌ర్శ‌కులు చెబుతున్నారు. `బాహుబ‌లి` స్ఫూర్తిని మ‌న‌ల్ని డామినేట్ చేయాల‌ని ప్ర‌య‌త్నించిన బాలీవుడ్ `షంషేరా`తో మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లాప‌డింది.
Tags:    

Similar News