ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభంకు అంతా సిద్దం అయ్యింది. కొన్ని రోజుల క్రితం మేము చెప్పినట్లుగానే బిగ్ బాస్ సీజన్ 3 ఈనెల 21న ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. డేట్ ప్రోమోను వైవిధ్యభరితంగా కట్ చేశారు. కెమెరా ముందు ఒకలా కెమెరా లేకుండా ఒకలా జనాలు ఉంటారు. కాని అక్కడ చుట్టు కెమెరాలు 24 గంటలు ఆన్ లోనే ఉంటాయి. కనుక యాక్టింగ్ కు వీలుండదు. కేవలం రియాలిటీ మాత్రమే అంటూ నాగార్జున్ చెప్పిన డైలాగ్ షో పై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తెలుగు బిగ్ బాస్ మొదటి రెండు సీజన్ లు కూడా మంచి విజయాలను దక్కించుకుని టీఆర్పీ రేటింగ్ లో రికార్డులను బద్దలు కొట్టాయి. ఇలాంటి సమయంలో రాబోతున్న మూడవ సీజన్ పై సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. మొదటి రెండు సీజన్ లకు ఎన్టీఆర్ మరియు నానిలు హోస్ట్ లుగా వ్యవహరిస్తే ఈసారి నాగార్జున బాధ్యతలు తీసుకున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో అయిన నాగార్జున ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా హోస్టింగ్ లో అనుభవం గడించాడు. ఇప్పుడు ఆయనకు బిగ్ బాస్ పెద్ద కష్టం ఏమీ అవ్వదని అంతా భావిస్తున్నారు.
ఇక పార్టిసిపెంట్స్ విషయంలో ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మార్చి నెల నుండి స్టార్ మా మరియు బిగ్ బాస్ నిర్వాహకులు పార్టిసిపెంట్స్ విషయంలో చర్చలు జరుపుతున్నారట. దాదాపు 50 మంది పేర్లను ఎంపిక చేసి అందులోంచి 14 మంది పేర్లను ఫైనల్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. వివిధ రంగాలకు చెందిన వారిని ఈ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. పార్టిసిపెంట్స్ పైనే టీఆర్పీ రేటింగ్ ఆధారపడి ఉంటుందని గతంలో జరిగిన బిగ్ బాస్ సీజన్ లు చెప్పకనే చెప్పాయి. అందుకే ఈసారి పార్టిసిపెంట్స్ విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ద తీసుకున్నట్లుగా స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Full View