తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మొదటి వారం రోజులు మంచి రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు మంచి రేటింగ్ వచ్చినా ఆ తర్వాత తర్వాత పరిస్థితి మారిపోయింది. వీక్ డేస్ లో రేటింగ్ 5 లేదా 6 రావడం మొదలు అయ్యింది. వీకెండ్స్ లో 10 వరకు రేటింగ్ వచ్చింది. వీకెండ్స్ రేటింగ్ పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా వీక్ డేస్ లో మాత్రం రేటింగ్ దారుణంగా పడిపోవడం పట్ల నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ వీక్ డేస్ రేటింగ్ మరింత వీక్ అయ్యింది. గత రెండు వారాలుగా వీక్ డెస్ ఎపిసోడ్స్ కు వస్తున్న రేటింగ్ మరీ దారుణంగా ఉండటంతో షో నిర్వాహణే ఇబ్బందిగా మారింది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
సమంత వీకెండ్ ఎపిసోడ్ కు రావడంతో ఆ ఎపిసోడ్ కు మంచి రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత వీకెండ్ ఎపిసోడ్ కు నాగార్జున రావడంతో దానికి కూడా పర్వాలేదు అన్నట్లుగా రేటింగ్ వచ్చింది. కాని కొందరు కంటెస్టెంట్స్ చేస్తున్న ఓవర్ యాక్షన్ వారి వల్ల పదే పదే చిల్లర గొడవలు జరగడం వంటి కారణాల వల్ల ప్రేక్షకులు వీక్ డేస్ లో షో ను చూడటమే మానేస్తున్నారు అంటూ నెట్టింట టాక్ వినిపిస్తుంది.
మొత్తానికి బిగ్ బాస్ వీక్ డేస్ రేటింగ్ మరింత వీక్ అవ్వడంతో వచ్చే వారం అయినా ఏదైనా జిమ్మిక్కు చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. మరే ప్రయత్నం చేయాలనుకున్న కరోనా అడ్డుగా ఉంది. కనుక షో రేటింగ్ ను పెంచడం ఎలా అంటూ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.