బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్‌ కుదరడం లేదా?

Update: 2021-06-29 06:30 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 ఈ సెప్టెంబర్‌ లో ప్రారంభించాలని నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట ఈ సీజన్‌ ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని భావించారని వార్తలు వచ్చాయి. కాని సెకండ్‌ వేవ్‌ దాదాపుగా పోయింది. ఇక థర్డ్‌ వేవ్‌ గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు చెబుతున్నారు. కనుక వ్యాక్సిన్ తీసుకున్న వారిని అనారోగ్య సమస్యలు లేని వారిని బిగ్ బాస్ హౌస్‌ లోకి పంపించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండక పోవచ్చు అంటూ నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ కోసం అన్వేషణ మొదలు అయ్యింది.

ఈసారి బిగ్ బాస్‌ హౌస్‌ లోకి వెళ్లేందుకు కాస్త ఫేమ్‌ ఉన్న స్టార్స్ ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదు. ప్రతి సారి ఫేమ్‌ లేని వారిని గుర్తింపు లేని వారిని ఎంపిక చేస్తున్నారు.. పారితోషికంకు భయపడి కంటెస్టెంట్స్‌ ఎంపిక చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్ కు కాస్త పాపులారిటీ ఉన్న సెలబ్రెటీలను ఎంపిక చేయాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారట. కాని వారికి ఇప్పటి వరకు సరైన కంటెస్టెంట్స్ లభించలేదని టాక్‌ వినిపిస్తుంది. గత సీజన్ లో మోనాల్‌ గజ్జర్‌ తో నడిపించారు. కాని ఈ సీజన్ లో మాత్రం అలాంటి హీరోయిన్‌ దొరికే పరిస్థితి కనిపించడం లేదు.

సీజన్‌ 5 ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే మళ్లీ లవ్ ట్రాక్స్ కావాల్సిందే. కాని ఈసారి అలాంటి వాటికి ఒప్పుకునే వారు మాత్రం కనిపించడం లేదట. ఫీమేల్‌ మాత్రమే కాకుండా మెల్‌ సెలబ్రెటీలు కూడా బిగ్‌ బాస్ 5 కోసం కాస్త ఫేమ్‌ ఉన్న వారు దొరకడం లేదు. యూట్యూబ్‌ మరియు టిక్ టాక్ ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారే ఎటు చూసిన కనిపిస్తున్నారట. పైగా ఈసారి నాగార్జున హోస్ట్‌ గా చేసేందుకు నిరాకరించారనే వార్తలు కూడా వస్తున్నాయి. రానా ను హోస్ట్‌ గా తీసుకు వస్తారని అంటున్నారు. ఆ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Tags:    

Similar News