బిబి4 : అమ్మలు వచ్చి అంతా మార్చేశారు

Update: 2020-11-19 04:30 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ముగింపు దశకు వచ్చింది. ఎప్పటి మాదిరిగానే ఈ సీజన్‌ లో కూడా కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులను పంపించారు. ఈసారి కరోనా కారణంగా గ్లాస్‌ క్యాబిన్‌ ఏర్పాటు చేస అందులోనుండి మాట్లాడుకోవడం కలుసుకోవడం చేశారు. పూర్తి సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకుంటున్న బిగ్‌ బాస్ నిర్వాహకులు ఈ ఏర్పాటును చేశారు. కరోనా కారణంగా ఈసారి కుటుంబ సభ్యులను లోనికి పంపించక పోవచ్చు అనుకున్నారు. కాని ఆ ఎమోషనల్‌ ఎపిసోడ్స్‌ ను స్కిప్‌ చేయకుండా గ్లాస్‌ క్యాబిన్‌ ఏర్పాటు చేసి మరీ ఇంటి సభ్యులను కలిపించారు. కమాండో డ్రిల్‌ టాస్క్‌ జరుగుతున్న సమయంలో అంత ఫ్రీజ్‌ అవ్వాలని ఆదేశించి మొదటగా అఖిల్‌ తల్లిని పంపించారు. ఆమె రాగానే అఖిల్‌ కన్నీరు పెట్టుకున్నాడు. అన్‌ ఫ్రీజ్‌ అనగానే ఇంటి సభ్యులు అంతా కూడా అటుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఆమె చాలా సేపు మాట్లాడింది. అభిజిత్‌ నీకు అన్నయ్య అంటూ చెప్పింది. అన్నదమ్ముల మాదిరిగా ఉండాలంటూ సూచించే ప్రయత్నం చేసింది.

అందరితో మాట్లాడిన అఖిల్‌ తల్లి మోనాల్‌ తో మాట్లాడలేదు. ఆ సమయంలో మోనాల్‌ ను ముందుకు తీసుకు వచ్చిన అఖిల్‌ తల్లికి పరిచయం చేశాడు. నీ బెస్ట్‌ ఫ్రెండ్‌ కదా అంది. అఖిల్‌ తల్లి వెళ్లి పోయిన వెంటనే అంతా ఎమోషనల్‌ అయ్యారు. ముఖ్యంగా అఖిల్‌ మరియు అభిజిత్‌ల మద్య ఏమీ లేదు అన్నట్లుగా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత హారిక తల్లి వచ్చారు. ఆమె కూడా సరదాగా మాట్లాడారు. ఈసారి అయినా కెప్టెన్సీ టాస్క్‌ విజేతగా నిలుస్తావా అంటూ ఏడిపించింది. ఇద్దర మద్య బాండింగ్‌ బాగుంది. హారికను బాగా చూసుకుంటున్నందుకు అభిజిత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. హారిక తల్లి వెళ్లి పోయిన తర్వాత అభిజిత్‌ తల్లి లోనికి వచ్చారు. ఆమె కన్నీరు పెట్టుకుంటే ఎమోషనల్‌ అవ్వద్దు అన్నాడు. అందరి గురించి అడిగి తెలుసుకుంది. ఒక్క రోజు ఈ హౌస్‌ లో ఉండాలని ఉంది అన్నారు.

ఇలాంటి అవకాశం మళ్లీ దొరక్కపోవచ్చు. బాగా ఎంజాయ్‌ చేయండి, బాగా కొట్టుకోండి అంది. ఆమె మాటలతో ఇంటి సభ్యులు అంతా కూడా గట్టిగా నవ్వేశారు. ఆమె వెళ్లిన తర్వాత కూడా ఇంటి సభ్యులు మళ్లీ అంతా ఎమోషనల్‌గా హగ్‌ చేసుకున్నారు. అవినాష్‌ తల్లి లోనికి రాగానే కొడుకును గ్లాస్‌ నుండే ముద్దు పెట్టింది. అందరు బాగుండాలని పూజలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండండి. పదే పదే పెళ్లి పెళ్లి అనవద్దు. బయటకు రాగానే చేస్తామని అవినాష్ తో చెప్పింది. అందరు కూడా అఖిల్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మలు రావడంతో అంతా కూడా ఎమోషనల్‌ గా మారిపోయారు. మొన్నటి వరకు కొట్టుకుంటారా అన్నట్లుగా గొడవ పడ్డ వారు ఒకరిని ఒకరు కన్నీరు పెట్టుకుంటూ కౌగిలించుకోవడం కనిపించింది. మొత్తానికి సీన్‌ మొత్తం మారింది. మరి వచ్చే వారి ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ సందర్బంగా ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News