Biggboss 6 : అత‌న్ని వ‌ద‌ల‌నంటున్న నేహా!

Update: 2022-09-27 05:05 GMT
బిగ్ బాస్ గ‌త సీజ‌న్ ల‌తో పోలిస్తే కాస్త స‌ప్ప‌గానే సాగుతోంది. చాలా వ‌ర‌కు కంటెస్టెంట్ ల‌లో ఆశించిన జోస్ .. ఆట‌తీరు క‌నిపించ‌క‌పోవ‌డంతో నిర్వాహ‌కులు కొంత అసంతృప్తికి అస‌హ‌నానికి లోన‌వుతున్నారంటూ నెట్టింట కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఎంపిక చేసిన కంటెంట్ ల విష‌యంలోనూ విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే బిగ్ బాస్ సీజ‌న్ 6 మూడ‌వ వారం ఎలిమినేష‌న్ పై పెద్ద ర‌చ్చే జ‌రుగుతోంది.ఈ వారం నేహా చౌద‌రి అనూహ్యంగా ఎలిమినేట్ అయి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.  

అయితే త‌న స్థానంలో ముందు ఇనాయా బ‌య‌టికి వెళుతుంద‌ని అంతా భావించారు. ప్ర‌తీ విష‌యాన్ని సంబంధం లేకుండా సాగ‌దీస్తున్న తీరుకు విసిగిపోయిన నెటిజ‌న్స్ ఇనాయానే ఈ సారి హౌస్ నుంచి ఎలిమేట్ అవుతుంద‌ని భావించారు. దీనిపైనే అధికంగా ప్ర‌చారం జ‌రిగింది కూడా.

కానీ బ‌య‌టికి వ‌స్తుందనుకున్న ఇనాయా సేఫ్ కావ‌డంతో నెటిజ‌న్ లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. నేహా చౌద‌రి కంటే ఇనాక్టీవ్ గా వున్న వారు హౌస్ లో వున్నార‌ని, అలాంటి వారిని కాపాడుతూ ఆడే వారిని బ‌య‌టికి పంపించ‌డం ఏం స్టాట‌జీనో అర్థం కావ‌డం లేద‌ని కామెంట్ లు చేస్తున్నారు.

ఇనాయా సేఫ్ కావ‌డంతో ఆ త‌రువాత వాసంతి, నేహా మ‌ధ్య ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైంది. చివ‌రికి నేహానే ఎలిమినేట్ అయిన‌ట్టుగా నాగార్జున ప్ర‌క‌టించ‌డంతో నేహా చౌద‌రి ఇంటి దారి ప‌ట్ట‌క‌త‌ప్ప‌లేదు. దీంతో నెటిజ‌న్ లు బిగ్ బాస్ పై కామెంట్ లు చేస్తున్నారు.

తాను ఎలిమినేట్ కావ‌డంపై నేహా కూడా షాకింగ్ కామెంట్ లు చేయ‌డం గ‌మ‌నార్హం. న‌మ్మిన వాళ్లే తనని న‌ట్టేట ముంచార‌ని, తాను బ‌య‌ట‌కు రావ‌డానికి రేవంత్ కార‌ణ‌మ‌ని స్టేజ్ పైనే కుండ బ‌ద్ద‌లు కొట్టింది నేహా.

ఇక ఆట బాగా ఆడిన‌ప్ప‌టికి తాను ఎందుకు ఎలిమినేట్ అయ్యాననేది ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేద‌ని నేహా వాపోయింది. హౌస్ లో ఆడ‌ని వాళ్లు, ప‌ని చేయ‌ని వాళ్లు చాలా మంది వున్నార‌ని మండిప‌డింది. అంతే కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ల‌భిస్తే ఖ‌చ్చితంగా అక్క‌డ తాను రివేంజ్ తీర్చుకోవాల్సిన వాళ్లు చాలా మంది వున్నార‌ని స్ప‌ష్టం చేసింది. నాగ్ ఇచ్చిన టాస్క్ ద‌మ్ము - దుమ్ము లో చంటి, సుదీప‌, శ్రీ‌హాన్‌, ఆదిరెడ్డి, శ్రీ‌స‌త్య‌, బాలాదిత్య ద‌మ్ము కేట‌గికీలో వుంటార‌ని, రేవంత్‌, ఆరోహి, గీతూ, అర్జున్‌, వాసంతి, ఇనాయా దుమ్ము కేట‌గిరీలో వుంటార‌ని స్ప‌ష్టం చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News