ప్రతియేటా డిసెంబర్ 31 మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కోసం ప్రజలు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తారన్నది తెలిసిందే. NY2023 పార్టీ పేరుతో ఆ నైటంతా జాగారం చేసేందుకు యువతరం ఆసక్తిగా ఉంటుంది. అయితే మిడ్ నైట్ లో చిలౌట్ కోసం పసందైన వీనుల విందైన కార్యక్రమాలు కావాలి. నేటితరం నైట్ పార్టీ లైఫ్ కి అలవాటు పడిపోవడమే గాక ప్రత్యేక ఈవెంట్లను అంతే ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. అదే క్రమంలో ఈవెంట్ల లో సెలబ్రిటీ విందు పసందు కావాలనుకుంటున్నారు. ఇది అందాల కథానాయికలు నటీమణులు యాంకర్లకు బోలెడంత ఆదాయాన్ని సమకూరుస్తోంది. NY2023 పార్టీలో డ్యాన్సుల ప్రదర్శన కోసం భారీ మొత్తాలను ఆర్జించే సదవకాశం కలుగుతోంది. ముఖ్యంగా టీవీ పరిశ్రమ- యూట్యూబ్ నుండి ప్రతిభావంతులైన గాళ్స్ బిగ్ బాస్ రియాలిటీ షోలో భాగం అవుతున్నారు. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సదరు భామలకు సినిమాలు బుల్లితెరపై అవకాశాలు వస్తున్నాయి.
బిగ్ బాస్ స్టార్లకు ఓవర్ నైట్ స్టార్లుగా ఎదిగేందుకు ఆస్కారం లేకున్నా నెమ్మదిగా సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది. వీళ్లెవరూ వెండితెరపై పెద్దగా కనిపించకపోయినా కొందరు గాళ్స్ హాటెస్ట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియా ఫాలోవర్లను పెంచుకుంటూ ఆ విధంగా కొంత ఆర్జిస్తున్నారు. బిగ్ బాస్ క్రేజ్ తో కొన్ని అదనపు ఆదాయ అవకాశాలను పొందుతున్నారు.
కోవిడ్ వల్ల గడిచిన రెండేళ్లు నూతన సంవత్సర వేడుకలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ఇలాంటి ప్రతిభ ఆదాయాన్ని కోల్పోయింది. గతంలో ప్రభుత్వాలే మిడ్ నైట్ వేడుకలకు చెక్ పెట్టేయడంతో ఇబ్బంది ఏర్పడింది. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలన్నింటికీ అనుమతించింది. అందుకే చాలా ఈవెంట్ కంపెనీలు భారీ ఎత్తున NY2023 వేడుకలను ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఈవెంట్లలో అందాల భామల డ్యాన్సులతో పాటు కామెడీ స్కిట్ లు కిక్కును పెంచనున్నాయి. ఇక మందు విందు పార్టీలకు అయితే కొదవే లేదు. ఇక హైదరాబాద్ ఔటర్ లోని రిసార్టుల్లో అయితే ఈ వీకెండ్ అంతా బోలెడంత హంగామా నెలకొననుందని సమాచారం.
అలాగే ఔటర్ లోని కొన్ని హోటళ్లలోను భారీగా ఈవెంట్లకు తెర లేపారు. దీనివల్ల చాలా మందికి పెర్ఫామెన్స్ కోసం భారీ మొత్తాలు ముట్టనున్నాయని తెలిసింది. వేడుకలో కేవలం కొన్ని గంటల పాటు పాల్గొని అహూతును రంజింపజేయడానికి లేదా వేదికపై డ్యాన్స్ చేయడానికి హీరోయిన్లు చాలా ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తుండడంతో ఈవెంట్ నిర్వాహకులు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు.. ఫేడెడ్ యువనాయికలు.. నటీమణులు.. యాంకర్లను సంప్రదిస్తున్నారని తెలిసింది.
కేవలం NY2023 పేరుతో లక్షల్లో పలువురు తారలు వెనకేసుకోవడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు మూడు గంటల పాటు ఈవెంట్ లో పాల్గొనడానికి చాలా ఎక్కువ మొత్తాలను కూడా కొందరు భామలు వసూలు చేస్తున్నారని కూడా తెలుస్తోంది. దాదాపు ప్రతి ఈవెంట్ ఆర్గనైజర్ బిగ్ బాస్ స్పైసీ గాళ్స్ ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుండడంతో పోటీలో డిమాండ్ కూడా అధికంగా ఉందని తెలిసింది.
అయితే బిగ్ బాస్ నటీమణులు కేవలం ఇలాంటి పార్టీల ఆదాయంతో సరిపెట్టుకుంటారా? లేక పెద్ద తెర స్టార్లుగా ఎదిగే ప్రయత్నం చేస్తారా? అన్నది వేచి చూడాలి. ఐటమ్ గాళ్స్.. డ్యాన్సర్లు.. వ్యాంపులుగా మిగిలిపోక ముందే వెండితెరపై వెలగడంపై సదరు భామలు ఫోకస్ చేయాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.