క్రేజీ చిత్రాలు నిర్మిస్తూనే నిర్మాతలు ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లని కూడా రెడీ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్స్ కూడా తామేమీ తక్కువ కాదంటూ ప్రొడ్యూసర్లతో చేతులు కలిపి ఓటీటీల కోసం వెబ్ డ్రామాలని తెరపైకి తీసుకొస్తున్నారు. న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఓటీటీల కోసం కొత్త తరహా వెబ్ సిరీస్ లని నిర్మిస్తున్నారు. ఇప్పటికే వెబ్ సిరీస్ ల నిర్మాణంలో పాలు పంచుకుంటున్నప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా మరో వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టారు. ఈ ఇద్దరు కలిసి జీ5 ఓటీటీ ప్లాట్ ఫాం కోసం `ఏటీఎం` అనే వెబ్ సిరీస్ ని ప్రారంభించారు.
`ఏటీఎం` వెబ్ సిరీస్ ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వెబ్ సిరీస్ తో దిల్ రాజు ఫ్యామిలీకి చెందిన హర్షిత్ రెడ్డి, దిల్ రాజు కూతురు హన్షితరెడ్డి నిర్మాతలుగా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 ఫేమ్ వీజే సన్నీ, దివి తో పాటు సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చంద్రమోహన్ ఈ సిరీస్ తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 27 నుంచి ఈ వెబ్ డ్రామా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
ఓ విభిన్నమైన కథతో `ఏటీఎం` చోరీ నేపథ్యంలో సాగే ఈ వెబ్ థ్రిల్లర్ కు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కథ అందించారు. ఇటీవల `ఏటీఎం` వెబ్ సిరీస్ కోసం కాస్టింగ్ కాల్ కు పిలుపునివ్వగా దీనికి భారీ స్పందన లభించింది. వీజే సన్నీ, దివి, సుబ్బరాజు తో పాటు చాలా మంది ప్రముఖ నటీనటులు, కొత్త వారు కూడా ఇందులో నటించనున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం అందించనున్న ఈ వెబ్ డ్రామాకు పీజీ విందా ఛాయాగ్రహణం అందించనున్నారు.
బిగ్‌బాస్ సీజన్ 5 లో వీజే సన్నీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్నా టైమ్ ఆయేగా అంటూ వీజే సన్ని తనదైన మేనరిజమ్స్ తో షోలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఫైనల్ లో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ని పక్కకు నెట్టేసి విజేతగా నిలిచి షాకిచ్చాడు. అప్నా టైమ్ ఆయేగా ఆయేగా అంటూ హల్ చల్ చేసిన వీజే సన్ని టైమ్ ఇప్పడు మొదలైంది. గతంలో టీవీ సీరియల్స్ లో నటించిన సన్నీ ఇప్పుడు బిగ్ బాస్ క్రేజ్ తో వెబ్ సిరీస్ లో నటించే అవకాశాన్ని, అది కూడా దిల్ రాజు, హరీష్ శంకర్ లాంటి కీలక వ్యక్తులు ఇన్‌వాల్వ్ అయిన వెబ్ సిరీస్ ద్వారా కెరీర్ ప్రారంభిస్తుండటంతో వీజే సన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారట.