BiggBoss5 : ప్రియాంకకు వార్నింగ్ ఇచ్చిన మానస్‌

Update: 2021-11-06 11:30 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 లో ట్రాన్స్ జెండర్ గా ప్రియాంక ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకు ముందు సీజన్ లో కూడా తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు ట్రాన్స్ జెండర్ ను ప్రయోగాత్మకంగా హౌస్‌ లోకి పంపించారు. తమన్నా సింహాద్రి ట్రాన్స్ జెండా కోటాలో వెళ్లి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వామ్మో ఈమె ఎప్పుడు పోతుందా అంటూ జనాలు ఎదురు చూశారు. బిగ్ బాస్ లో మరో ట్రాన్స్‌ జెండర్‌ అనగానే అంతా కూడా అదే అనుకున్నారు. కాని ప్రియాంక అలియాస్ పింకీ పూర్తి విభిన్నంగా తమన్నా సింహాద్రి క్రియేట్‌ చేసిన అభిప్రాయంను తొలగించేసింది. ప్రియాంక హౌస్‌ లో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. ప్రతి ఒక్కరి పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించి ఇంట్లో వారందరికి కూడా తానే భోజనం వండి పెడుతుంది. అందరిలోకి మానస్ అంటే ప్రత్యేకంగా చూస్తూ అతడిపై మనసు పడ్డట్లుగా ప్రియాంక వ్యవహరిస్తుంది.

పొద్దున లేస్తే ప్రియాంక అన్ని పనులు కూడా మానస్ చుట్టు తిరుగుతూ ఉంటాయి. ఆమె కేవలం మానస్ కోసం వచ్చిందా అన్నట్లుగా ప్రేక్షకులు ఒకానొక సమయంలో ఫీల్ అవుతున్నారు. మానస్‌ ఏమైనా అంటే తట్టుకోలేక నానా యాగి చేసే ప్రియాంక అతడికి చిన్న గాయం అయితే తట్టుకోలేదు. మానస్ కూడా మొదట్లో ప్రియాంకను కాస్త దూరంగా పెట్టినట్లుగా వ్యవహరించినా ఆ తర్వాత తర్వాత ఆమెను చేరదీశాడు. అది గేమ్‌ లో భాగమా లేదంటే నిజంగానే ప్రియాంకపై అతడికి మంచి ఉద్దేశ్యం ఉందా అనేది తెలియదు. కాని చాలా స్నేహంగా ప్రియాంకతో ఉంటాడు. ప్రియాంక తప్పు చేస్తే మందలిస్తాడు.. ఆమె అలిగితే తినిపిస్తున్నాడు. అలా మొత్తానికి ప్రియాంక మరియు మానస్ ల వ్యవహారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రియాంక తో తాజా ఎపిసోడ్‌ లో కాస్త సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్లుగా మానస్‌ మాట్లాడాడు. నీవు ఆవేశంలో ఉన్నప్పుడు అవతలి వారిపై చాలా సీరియస్ గా మాటలు అనేస్తావు. అవతలి వారికి శాపనార్థాలు పెట్టేస్తున్నావు. నీకు నచ్చని వారిని ఏకంగా సర్వనాశనం అవ్వాలని కోరుకుంటావు. అలాంటి పద్దతి మార్చుకో అంటూ కాస్త సీరియస్ గానే అన్నాడు. ఆ సమయంలో ప్రియాంక ఫీల్ అయ్యింది. ఇలాంటి మాటలు నీ నోటి నుండి వినడం బాధగా ఉందంటూ అక్కడ నుండి వెళ్లి పోయింది. మళ్లీ కొద్ది సేపటికే మానస్ వద్దకు వచ్చి మాట్లాడింది. మానస్ అంత మాట అన్నా కూడా తనను తాను మార్చుకుంటాను అంటూ అతడి వద్దకు వెళ్లి మాట కల్పింది. ట్రాన్స్ జెండర్‌ లను ఏమీ అనకూడదు.. వారితో మాట పడకూడదు అనేది కొందరు అనుకుంటూ ఉంటారు. అందుకే మానస్ సున్నితంగా ప్రియాంతో అలా అని ఉంటాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News