#BIGGBOSS5TELUGU : వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కోసం క్వారెంటైన్‌

Update: 2021-10-04 08:31 GMT
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 అప్పుడే నాలుగు వారాలు ముగించుకుంది. ఇప్పటి వరకు సరయు.. ఉమాదేవి.. లహరి.. నటరాజ్‌ లు ఎలిమినేట్‌ అయ్యారు. షో ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ప్రతి సీజన్‌ లోమాదిరిగా ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఉంటుందని మొదటి నుండి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సహజంగా అయితే రెండు మూడు వారాల తర్వాత అది కాదంటే నాల్గవ వారం తర్వాత అయినా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉంటుంది. కాని ఈసారి మాత్రం వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఆలోచన ఉందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని తాజాగా బిగ్‌ బాస్‌ క్లోజ్ ఫాలోవర్స్ మరియు మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అయిదు వారాలు ముగిసిన తర్వాత ఆరవ వారంలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

స్టార్‌ మా వర్గాల వారి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం షో లో పాల్గొనేందుకు ఇప్పటికే ఒక కంటెస్టెంట్‌ వైల్డ్ కార్డ్‌ తో రెడీ గా ఉన్నారట. ఆ వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ గురించిన విషయాలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే ఆ వైల్డ్‌ కార్డ్‌ ను క్వారెంటైన్ లో ఉంచారని.. ఆదివారం ఎపిసోడ్‌ లో ఆ వైల్డ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. మొదట ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ గురించిన ఆలోచన లేదని టీమ్ అన్నారు. కాని షో ను ఇంట్రెస్టింగ్‌ మా మార్చేందుకు గాను ఒక వైల్డ్‌ వైల్డ్‌ కార్డు కంటెస్టెంట్‌ ను ఇంట్లోకి పంపించాలని భావించారు. ఇంట్లో ఉన్న వారు అంతా కూడా చాలా సేఫ్ గా గేమ్‌ ఆడుతున్నారు. వారందరి మాస్క్‌ లు తొలగించేలా ఒక వైల్డ్ ఎంట్రీ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ సమాచారం అందుతోంది.

బిగ్‌ బాస్ ఈ సీజన్ లో ప్రత్యేక ఆకర్షణగా ట్రాన్స్ జెండర్‌ ప్రియాంక ఉండగా లోబో మరియు యాంకర్‌ రవిలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఇంకా సోషల్‌ మీడియా సెన్షేషన్ అయిన షణ్ముఖ్‌ జస్వంత్‌ మరియు సిరిలు కూడా ఈ సీజన్ లో ఆకట్టుకుంటున్నారు. పెద్ద ఎత్తున వీరిద్దరిపై జనాల్లో ఆసక్తి ఉంది. ఇతర కంటెస్టెంట్స్ కూడా వారి వారి గుర్తింపును కంటిన్యూ చేస్తున్నారు. కాని వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఎంట్రీతో ఈక్వెషన్స్ మారిపోతాయేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న బిగ్ బాస్ వైల్డ్‌ కార్డ్‌ ఎవరై ఉంటారు అంటూ నెటిజన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెట్టింట ఈ విషయం గురించి వైరల్ అవుతోంది.
Tags:    

Similar News