#BIGGBOSS5TELUGU : షణ్ను ఫైర్ కంటిన్యూ చేస్తాడా?

Update: 2021-10-07 07:30 GMT
బిగ్‌ బాస్ సీజన్‌ 5 లో మొదటి నాలుగు వారాలు కూడా కంటెస్టెంట్స్‌ షణ్ముఖ్‌ ను నామినేట్ చేయలేదు. నాలుగు వారాల పాటు ఒక్క సారి కూడా అతడు నామినేషన్ కు వెళ్లక పోవడం చర్చనీయాంశం అయ్యింది. నామినేషన్స్ లో షణ్ను నిలవక పోవడం గురించి విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకున్నారు. అయిదవ వారం వచ్చేప్పటి వరకు షణ్ను ను ఏకంగా ఎనిమిది మంది నామినేట్‌ చేశారు. ఈ వారం కూడా ఓపెన్‌ నామినేషన్ అయితే ఖచ్చితంగా ఎవరు ఆయన్ను చేయక పోయేవారేమో. కాని సీక్రెట్ అవ్వడం వల్ల చాలా మంది షన్ను ను నామినేట్‌ చేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థం అవుతున్నది ఏంటీ అంటే షన్నుకు ఉన్న ఫాలోయింగ్‌ ను చూసి వారు భయపడ్డారు అందుకే నామినేట్‌ చేయలేదు ఇన్నాళ్లు అనేది బయట విశ్లేషకుల అభిప్రాయం. నామినేట్ చేసిన ఇంటి సభ్యుల విషయాన్ని బయటకు చెప్పడంతో షన్ను లో ఫైర్‌ మొదలు అయ్యింది. ఇన్నాళ్లు చాలా కూల్‌ గా కనిపించిన షన్ను తనను ఇంతగా టార్గెట్ చేస్తున్నారా అనే ఉద్దేశ్యంలోకి వెళ్లి పోయాడు.

ఇకనుండి నా ఆట చూస్తారు అంటూ షన్ను చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తూ ఆట ఆడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్ లో భాగంగా తన బెస్ట్‌ ఇవ్వడంతో పాటు తన లో ఉన్న ఫైర్‌ ను సాధ్యం అయినంత వరకు చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మైండ్‌ గేమ్‌ ను మాత్రమే కాకుండా ఫిజికల్‌ గేమ్స్ లో కూడా తన వంతు ఇచ్చేందుకు గాను ప్లాన్‌ చేస్తున్నాడు. ఇదే సమయంలో తనను టార్గెట్‌ చేసిన వారిని ఏ ఒక్కరిని కూడా వదిలేది లేదు అన్నట్లుగా ప్లాన్‌ చేస్తున్నాడు. ఒక వైపు సన్నీకి మద్దతు తెలుపుతున్నట్లుగా ఉన్నా కూడా రవికి వ్యతిరేకంగా ఉన్నా కూడా అతడు ఇద్దరికి వ్యతిరేకంగా ఆడేందుకు తన టీమ్‌ అయిన సిరి మరియు జెస్సీలను ప్రేరేపిస్తున్నాడు. మొత్తానికి జెస్సీ మరియు సిరిని ఉపయోగించుకుని షన్ను తన ఆట ఆడుతున్నాడు. ఈ ముగ్గురు కూడా చాలా ఫైర్ తో కనిపిస్తున్నారు.

జెస్సీ మొన్నటి వరకు చిన్న పిల్లాడి మాదిరిగా అందరు చూసినా కూడా ఇప్పుడు మాత్రం అతడి తీరును చాలా సీరియస్ గా ప్రేక్షకులు తీసుకునేలా వ్యవహరిస్తున్నాడు. అద్బుతమైన కమ్‌ బ్యాక్‌ అనడంలో సందేహం లేదు. తన పనిని తాను సక్రమంగా చేస్తూ.. తనపై రుద్దాలనుకున్న పనులను చేయను అంటూ చెప్తూ జెస్సీ మాట్లాడుతున్న తీరు అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వారంలో అబ్బాయిల్లో శ్రీరామ్‌ తప్ప అందరు నామినేట్ అయ్యారు. ఇక ప్రియా మరియు హమీదాలు నామినేట్ అయ్యారు. మొత్తం 9 మందిలో ఎవరు వీక్ ఎవరు స్ట్రాంగ్‌ అనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఎలిమినేషన్‌ రసవత్తరంగా ఉంటుందనే నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 నుండి బయటకు వచ్చే 5వ కంటెస్టెంట్‌ ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News