ఈ జనరేషన్‌ హీరోల్లో బిగ్గెస్ట్‌ మాస్ హీరో ఎవరు?

Update: 2022-05-01 10:30 GMT
సీనియర్‌ స్టార్‌ హీరోల్లో నెం.1 స్థానం మెగాస్టార్‌ చిరంజీవి దక్కించుకున్నారు. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఆయన టాలీవుడ్‌ నెం.1 స్టార్ హీరోగా నిలిచారు. ఆయనతో ఏమాత్రం తగ్గకుండా బాలకృష్ణ.. వెంకటేష్.. నాగార్జున మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ను దక్కించుకుని అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్‌ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు జనరేషన్ లో నెం.1 హీరో ఎవరు అనే విషయం చెప్పలేని పరిస్థితి.

ఈ హీరో నెం.1 గా దూసుకు పోతున్నాడు.. ఈయనే నెంబర్‌ 1 అనుకునే లోపు మరో ఇద్దరు హీరోలు ఆ హీరోను మించిన సక్సెస్ లు దక్కించుకుంటూ దూసుకు వస్తున్నారు. దాంతో గడచిన దశబ్దం కాలంగా ఈ  జనరేషన్‌ లో నెం.1 టాలీవుడ్‌ హీరో అనే వారు లేరు. ప్రతి ఒక్క స్టార్‌ హీరో అభిమాని కూడా తమ హీరోనే నెం.1 అనుకుంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటూ సంతృప్తి చెందుతున్నారు.

ఇక ఈ జెనరేషన్ హీరోల్లో బిగ్గెస్ట్‌ మాస్ హీరో ఎవరు అనే చర్చ జరిగితే మాత్రం ముఖ్యంగా ఎన్టీఆర్‌.. రామ్‌ చరణ్ మరియు అల్లు అర్జున్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా కొందరి హీరోల పేర్లు ప్రస్థావనకు వచ్చినా మాస్ హీరోగా బిగ్గెస్ట్‌ సక్సెస్ లు దక్కించుకున్న స్టార్స్ వీరే కనుక ఎక్కువ శాతం వీరి పేర్లు ప్రస్థావనకు వస్తున్నాయి. ప్రతి ఒక్క స్టార్‌ హీరో కూడా మాస్ లో అంతో ఇంతో స్టార్‌ డమ్ ను కలిగి ఉన్నారు.

బిగ్గెస్ట్‌ మాస్ హీరో అనే ట్యాగ్‌ మాత్రం ఈ ముగ్గురు హీరోల్లో ఒకరికి దక్కుతుందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు ఈ ముగ్గురు హీరోల ఫ్యాన్స్ మా హీరో మాస్ కా బాప్‌... గాడ్‌ ఆఫ్‌ మాస్ అంటూ చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. సందర్బానుసారం ఒక్కో హీరో ఒక్కోసారి మాస్ గా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నారు.

ఈ ముగ్గురు హీరోల్లో ఏ ఒక్కరిని కూడా బిగ్గెస్ట్‌ మాస్ హీరో అని.. మరొకరిని తక్కువ అని చెప్పడానికి లేదు. ముగ్గురికి ముగ్గురు నూటికి నూరు శాతం మాస్ ఎలిమెంట్స్ తో నటనలో మరియు డాన్స్ బాడీ లాంగ్వేజ్ లో బిగ్గెస్ట్‌ మాస్‌ హీరో అనిపించుకున్నారు. వీళ్లలో ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని కాకుండా టాలీవుడ్‌ లో మాస్ గాడ్స్ గా వీరి ముగ్గురిని అభిమానులు మరియు సినీ ప్రేమికులు ప్రేక్షకులు ప్రేమిస్తున్నారు.

ఇప్పటి వరకు వీరు ముగ్గురు చేసిన మాస్ సినిమాలు అయితేనేం... ముందు ముందు కూడా వీరు చేయబోతున్న మాస్ సినిమాలు అయితేనేం వీరిని మాస్ లో మరింతగా చొచ్చుకు పోయేలా చేస్తాయంటూ విశ్లేషకులు నమ్మకంతో ఉన్నారు. ఈ ముగ్గురు మాత్రమే కాకుండా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు నాని నుండి మొదలు పెడితే నితిన్ వరకు ఎంతో మంది టైర్ 2 హీరోలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మాస్ పల్స్ పట్టుకుని.. వారికి నచ్చినట్లుగా వరుస సక్సెస్ లు ఇస్తే వారు మాస్ హీరోలుగా మారిపోతున్నారు. కనుక ఇందులో బిగ్గెస్ట్‌.. స్మాలెస్ట్‌ అనడానికి ఛాన్స్ లేదు.
Tags:    

Similar News