దేవర అనిరుద్.. బాగా గిట్టుబాటు అయ్యిందా..?
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రీసెంట్ గా వచ్చిన దేవర సినిమా ప్రేక్షకులను మెప్పించింది.
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రీసెంట్ గా వచ్చిన దేవర సినిమా ప్రేక్షకులను మెప్పించింది. సెప్టెంబర్ 27 శుక్రవారం రిలీజైన ఈ సినిమా మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నా చిన్నగా ఆడియన్స్ అనరికీ కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఓ పక్క దేవర వసూళ్లు అదరగొడుత్తున్నాయి. నేటి నుంచి తెలుగు రెండు రాష్ట్రాల స్కూల్స్ కు హాలీడేస్ కాబట్టి కచ్చితంగా దేవరకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. దేవర సినిమాలో ఆన్ స్క్రీన్ ఎన్ టీ ఆర్ రెండు పాత్రలు జాన్వి అందాల మెరుపులు సైఫ్ అలీ ఖాన్ విలనిజం ఇవన్నీ ప్లస్ కాగా ఆఫ్ స్క్రీన్ అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది.
దేవర సినిమాకు అనిరుద్ తన ప్రాణం పెట్టి పనిచేశాడని చెప్పొచ్చు. సాంగ్స్, బిజిఎం దేనికదే ప్రత్యేకం అనిపించేలా చేశాడు. ఐతే దేవర సినిమాకు మ్యూజిక్ అందించినందుకు అనిరుద్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుని ఉంటాడు అన్న చర్చ మొదలైంది. సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అనిరుద్ తను చేసిన ప్రతి సినిమా మ్యూజిక్ పరంగా ది బెస్ట్ అనిపించేస్తున్నాడు.
తెలుస్తున్న సమాచారం ప్రకారం దేవర సినిమాకు అనిరుద్ దాదాపు 12 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తుంది. సౌత్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు. అకాడమీ విన్నర్స్ ఏ.ఆర్ రహమాన్ సినిమాకు 10 కోట్లు తీసుకుంటుండగా కీరవాణి 6 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
ఇదే లిస్ట్ లో దేవి శ్రీ ప్రసాద్ కూడా 8 కోట్లు థమన్ కూడా 6 నుంచి 7 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఐతే అనిరుద్ మాత్రం తీసుకున్న మ్యూజిక్ కి ది బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నాడు. అందుకే సినిమా సినిమాకు అతని రేంజ్ పెరుగుతూ వెళ్తుంది. దేవర మ్యూజిక్ పరంగా ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ ని సూపర్ సాటిస్ఫైడ్ చేశాడు అనిరుద్. ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 కే ఇలా ఉంటే పార్ట్ 2కి అనిరుద్ మరింత రెచ్చిపోతాడని తెలుస్తుంది. దేవర పార్ట్ 2 లోనే అసలు కథ ఉంటుందని తెలుస్తుండగా మ్యూజిక్ పరంగా అనిరుద్ కూడా అదరగొట్టేస్తాడని చెప్పొచ్చు.