గోవింద- సునీతా అహుజా విడాకులపై కజిన్ ఏమన్నారు?
బాలీవుడ్ స్టార్ హీరో గోవింద తన భార్య సునీతా అహూజా నుంచి విడిపోతున్నారా? అంటే అవుననే కథనాలొస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో గోవింద తన భార్య సునీతా అహూజా నుంచి విడిపోతున్నారా? అంటే అవుననే కథనాలొస్తున్నాయి. 37 ఏళ్ల వైవాహిక బంధం విచ్ఛిన్నం కాబోతోందని హిందీ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. జూమ్ టీవీ వివరాల ప్రకారం.. ఈ జంట కొంతకాలంగా విడివిడిగా నివసిస్తున్నారు. అయితే గోవింద నుంచి కానీ, ఆయన భార్య సునీతా అహుజా నుండి కానీ విడాకుల పుకార్లపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
భార్యా భర్తలు విరుద్ధమైన జీవనశైలి- ఆశలు- ఆకాంక్షలు విడిపోవడానికి కారణాలు అని కథనాలొస్తున్నాయి. పాపులర్ బాలీవుడ్ వెబ్‌సైట్ తన కథనంలో.. గోవిందాకు మరాఠీ నటితో ఉన్న శృంగార సంబంధం భార్యతో బ్రేకప్ కి కారణమని పేర్కొంది. ఇటీవల గోవిందా భార్య తాము తక్కువ సమయం కలిసి నివసిస్తామని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో సునీతా అహుజా వారి జీవన శైలి, ఆసక్తులను షేర్ చేసుకోలేకపోవడం గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. గోవింద తరచుగా తన బంగ్లాలోనే ఉంటాడు కాబట్టి ఎక్కువగా విడిగా జీవిస్తామని వెల్లడించింది.
గోవిందా భార్య అనిత మాటలను బట్టి వారికి రెండు ఇళ్లు ఉన్నాయి. వాటిలో ఒక ఇంట్లో ఆమె తన పిల్లలతో ఉంటుంది. వేరొక ఇంట్లో గోవిందా ఉంటారు. నాకు నా గుడి, నా పిల్లలు ఫ్లాట్‌లోనే... ఆయన తన మీటింగుల తర్వాత ఆలస్యంగా వస్తాడు. అతడు మాట్లాడటం ఇష్టపడతాడు కాబట్టి 10 మందిని పిలిచి వారితో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాడు. నేను నా కొడుకు కూతురితో కలిసి జీవిస్తున్నాము. కానీ మేం చాలా అరుదుగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడితే శక్తిని వృధా చేసుకున్నామని బాధపడాల్సి ఉంటుంది! అని సునీతా అహుజా చెప్పారు.
అయితే బ్రేకప్ పుకార్ల నడుమ సునీత కొన్ని నెలల క్రితం విడిపోవడానికి గోవిందాకు నోటీసు పంపారని కథనాలొచ్చాయి. కానీ ఆ తర్వాత వివరాలేవీ తెలియలేదు అని ఓ వార్త షికార్ చేస్తోంది. కుటుంబంలో దంపతుల మధ్య సమస్యలు ఉన్నాయి. దానికి మించి ఏమీ లేదు! అని గోవిందా కుటుంబీకుల్లో ఒకరు వ్యాఖ్యానించినట్టు కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం గోవింద కొత్త సినిమా ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నాడని కూడా తెలిపారు.
గోవింద మిమ్మల్ని ప్రేమిస్తాడా? అని ప్రశ్నించగా.. సునీత అహూజా నవ్వేస్తూ మాట్లాడారు. ``నా నెక్ట్స్ జన్మలో నువ్వు నా భర్త కాకూడదని అతడికి చెప్పాను. అతడు కనీసం విహార యాత్రలకు రాడు. నేను భర్తతో బయటకు వెళ్లి వీధుల్లో పానీ-పూరీ తినాలని కోరుకుంటాను. అతడు రోజంతా తన పనితోనే ఎక్కువ సమయం గడుపుతాడు. మేమిద్దరం సినిమా చూడటానికి బయటకు వెళ్ళిన ఒక్క సందర్భం కూడా నాకు గుర్తులేదు! అని చెప్పింది.
గోవింద -సునీతా అహుజా మార్చి 1987లో వివాహం చేసుకున్నారు. 1988లో కుమార్తె టీనాను స్వాగతించిన తర్వాత ఈ జంట తమకు పెళ్లయిందని ప్రకటించారు. తరువాత వారికి 1997లో యశ్వర్ధన్ అనే కుమారుడు జన్మించాడు.
అవన్నీ పుకార్లు.. గోవిందా మేనకోడలు
గోవిందా- సునీత జంట విడిపోతున్నారని మీడియాలో వచ్చిన కథనాలను గోవిందా కజిన్ ఆర్తి సింగ్ ఖండించారు. ఆ జంట మధ్య అనుబంధం గొప్పది. వారు విడిపోరు. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. ఇలాంటి తప్పుడు వార్తలతో ఒత్తిడి పెంచొద్దు అని కోరారు. తాను విదేశాల్లో ఉన్నానని, తన విడాకుల గురించి కూడా ఇలానే మీడియా ప్రచారం చేసిందని గుర్తు చేసుకున్నారు.