కల్చర్ లేనివాడు ఈ హోస్ట్.. విమర్శించిన పెద్ద నటుడు..
నిజానికి 2020లో నటుడు ముఖేష్ ఖన్నా మినహా 'మహాభారతం' పూర్తి తారాగణం కపిల్ శర్మ షోకి వచ్చింది.
టెలివిజన్ ప్రేక్షకులకు శక్తిమాన్ గా సుప్రసిద్ధుడు ముఖేష్ ఖన్నా. ఆ పాత్రలో ఆయనను తప్ప ఇంకెవరినీ అభిమానులు ఊహించుకోలేరు. ప్రజల్లో శక్తిమాన్ గా గొప్ప ఇమేజ్ ఉన్న ఈ సీనియర్ నటుడు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా హెడ్ లైన్స్ లో కొస్తున్నాడు. తాను పోషించిన శక్తిమాన్ పాత్రకు బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ అస్సలు సూట్ కాడని నిర్మొహమాటంగా వ్యాఖ్యానించిన ముఖేష్ జీ... ఇప్పుడు బుల్లితెర హోస్ట్, కమెడియన్ కపిల్ శర్మ కల్చర్ లేనివాడు! అని సూటిగా విమర్శించాడు.
నిజానికి 2020లో నటుడు ముఖేష్ ఖన్నా మినహా `మహాభారతం` పూర్తి తారాగణం కపిల్ శర్మ షోకి వచ్చింది. కానీ ముఖేష్ జీ మాత్రం రాలేదు. ``అసభ్యత కారణంగా నాకు బిగ్ బాస్ లేదా కపిల్ శర్మ షో ఇష్టం లేదు`` అని అతడు స్పష్ఠంగా తెలిపాడు. కానీ కపిల్ శర్మ ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు అని కితాబిచ్చాడు. కపిల్ పై అంతటి వ్యతిరేకతకు కారణమేంటో సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా వెల్లడించారు.
కపిల్ శర్మకు వ్యతిరేకిగా మార్చిన రెండు సంఘటనలున్నాయి. ఆ ఒక్కటే కారణమని నేను చెప్పను కానీ నా వైబ్రేషన్స్ అతడితో సరిపోలలేదు. వ్యక్తి మంచివాడు కావచ్చు.. కానీ నేను అతడితో సుఖంగా ఉండలేను. అతడు దానిని గ్రహించాడని నేను అనుకోను.. కానీ నేను కృష్ణ అభిషేక్‌కి చెప్పాను. వారు కామెడీ సర్కస్‌లో స్కిట్‌లు చేసేవారు.. కపిల్ చేసిన పొరపాటు ఏమిటంటే అతడు శక్తిమాన్ దుస్తులను ధరించాడు.. తన ముందు ఒక అమ్మాయి, పక్కన మంచాన్ని చూపించారు! నిజానికి శక్తిమాన్ భోగి అని లేదా అతడికి తీరిక లేదు అని చెప్పాలనుకోవడాన్ని ఆయన కించపరచడంగా చూసారు.
మేం ఈ పాత్రను చాలా నీతివంతమైనదిగా చూపించాము. కానీ శక్తిమాన్ బిజీగా ఉన్నందున అమ్మాయి వద్దకు వెళ్లడం లేదని మీరు చూపిస్తున్నారు-లేకపోతే శక్తిమాన్ అమ్మాయిలను ఆకర్షిస్తాడు అని చెబుతున్నారు. మీరు కామెడీ కోసమే ఇలా చేస్తున్నారు. నేను కృష్ణను పిలిచి ఇదేం పని? అని అడిగాను. అయితే ఈ సీన్ ని తాను చేయవలసి ఉందని కృష్ణ నాతో చెప్పాడు.. కానీ కపిల్ దానిని అతడి నుండి లాక్కున్నాడు.. రెండవ సంఘటన ఒక అవార్డ్ షోలో జరిగింది. నేను ముందు వరుసలో కూర్చున్నాను. కపిల్ ఇప్పుడే ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యాడని అనుకుంటున్నాను. అతడు 10-20 నిమిషాలు నా పక్కన కూర్చున్నాడు కానీ ఒక్కసారి కూడా నన్ను పలకరించలేదు. అతడు తన అవార్డును తీసుకొని వెళ్లిపోయాడు. ఈ రెండు విషయాలు నా మనస్సులో ఉన్నాయి. అందుకే అతడు సంస్కారహీనుడని అన్నాను`` అని అన్నారు. మిమ్మల్ని మీరు అంత పెద్దవాడిని అని ఎందుకు అనుకుంటున్నారు? అలాంటి వ్యక్తి ఇలా ప్రవర్తిస్తే గౌరవం పోతుంది! అని కపిల్ శర్మ అన్నారు.