బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ `బిగ్ బాస్ నాన్ స్టాప్` సీజన్ లో విజేతగా నిలిచి వార్తల్లో కెక్కింది బిందు మాధవి. తెలుగులో అనీష్ కురువిల్ల దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన తొలి ప్రయత్నం `ఆవకాయ బిర్యానీ`. ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి బిందు మాధవి.
ఆ తరువాత బంపర్ ఆఫర్, రామ రాయ కృష్ణ కృష్ణ చిత్రాల్లో నటించింది. కొంత విమరాం తరువాత నేచురల్ స్టార్ నాని నటించిన `పిల్ల జమీదార్`లోనూ మెరిసింది. అయితే తెలుగులో ఆ తరువాత చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కు మకాం మార్చేసింది.
తాజాగా బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ `బిగ్ బాస్ నాన్ స్టాప్`తో మళ్లీ టాలీవుడ్ లో వార్తల్లో నిలిచింది. ఈ సీజన్లో విజేతగా నిలిచి నెట్టింట వైరల్ గా మారింది. బిగ్ బాస్ ట్రోఫీని సొంతం చేసుకున్న దగ్గరి నుంచి నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో వుంటోంది. బిగ్ బాస్ లో తనని ట్రోల్ చేసిన వారిపై విరుచుకుపడిన బిందు ఆడపులి అనిపించుకుంది. తాజాగా తన డ్రెస్సింగ్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై బిందు మాధవి ఘాటుగా స్పందించింది.
వేసుకున్న దుస్తులని బట్టి ఇచ్చే గౌరవం తనకు అక్కర్లేదన్నారు. కొంత మంది నెటిజన్ లు బిందు మాటలకు సపోర్ట్ గా నిలిచి అభినందిస్తుండగా మరి కొంత మంది మాత్రం మిమ్మల్ని అలాంటి ఫ్యాషన్ డ్రెస్సుల్లో చూడలేకపోతున్నామంటూ కామెంట్ లు చేస్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీ షోతో మళ్లీ వెలుగులోకి వచ్చిన బిందు మాధవి ప్రస్తుతం పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన డ్రెస్ లలో ప్రత్యేకంగా ఫోటో షూట్ లలో పాల్గొంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. గ్లామర్ డోస్ ఎక్కువ కావడంతో బిందు షేర్ చేసిన ఫొటోలపై పలువురు నెటిజన్ లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ బిందు మాధవి డ్రెస్సింగ్ పై అసహనం వ్యక్తం చేశాడు. `బిగ్ బాస్ లో వున్నప్పుడు ఆమెను చూస్తే నాకు ఎంతో ఆనందంగా అనిపించేదని, హౌస్ లో వున్న వాళ్లంతా ఎక్స్పోజ్ చేసేలా డ్రెస్ లు వేసుకున్నప్పటికీ బిందు మాధవి మాత్రం సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించేవారన్నాడు.
కానీ ఇప్పడు ఈ ఫొటోలు చూసిన తరువాత ఆమెపై గౌరవం పోయిందని వాపోయాడు. అయితే ఈ కామెంట్ బిందు మాధవి ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఎదుటి వాళ్లు ధరించే దుస్తులు చూసి వారికి మీరు మర్యాద, గౌరవం ఇవ్వాలనుకుంటే నాకు అలాంటి మర్యాద అస్సలు అవసరం లేదని సమాధానం చెప్పింది.. బిందు మాధవి ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.