10 కోట్ల గిఫ్ట్.. అందలేదన్న బిప్స్..

Update: 2016-06-18 09:19 GMT
బాలీవుడ్ కలల రాణి బిపాషా బసు ఈ మధ్యనే పెళ్లి చేసేసుకున్న విషయం తెలిసిందే. కరణ్ సింగ్ గ్రోవర్ ని పెళ్లి చేసుకుని మహా సంతోషంగా ఉంది ఈ హీరోయిన్. అతగాడికి  మొదటి పెళ్లి కాకపోయినా.. తనకు ఫస్ట్ రిలేషన్ కాకపోయినా.. మ్యారేజ్ లైఫ్ మాత్రం ఈ సుందరాంగి బోలెడన్న హోప్స్ పెట్టుకుంది. సోషల్ సైట్లలో సహా తన పేరు వెనక మొగుడి పేరు కూడా తగిలిస్తూ.. ఈ మధ్య బాగా బిజీగా ఉంది బిప్స్.

సైలెంట్ గా సన్నిహితుల మధ్యే ఏప్రిల్ నెలాఖర్లో పెళ్లి చేసుకున్న బిపాషా బసు.. మే మొదటి వారంలో మాత్రం గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ కంటే.. బిపాషా స్నేహితుడు - బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఓ పది కోట్ల రూపయల విలువ చేసే ఇంటిని.. బిపాషా బసు మ్యారేజ్ సందర్భంగా సల్మాన్ గిఫ్ట్ గా ఇచ్చాడనే న్యూస్ హల్ చల్ చేస్తోంది. తోటి హీరోయిన్ పెళ్లి చేసుకుంటే సల్మాన్ 10కోట్ల రూపాయల బహుమతి ఇవ్వడం బాగా వైరల్ అయిపోయింది.

ఇప్పుడీ వార్తలపై బిపాషా స్వయంగా స్పందించింది. సల్మాన్ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ పొందానన్న మాటను ఖండించింది బిపాషా. సల్లూ భాయ్ తన మ్యారేజ్ రిసెప్షన్ కు వచ్చిన మాట వాస్తవమే అయినా.. 10 కోట్ల బహుమతి మాత్రం అంతా ఫేక్ అని కొట్టి పడేసింది బిపాషా బసు.
Tags:    

Similar News