షాకిచ్చిన బిపాసా..పాపాయిని ముద్దాడుతూ ఇలా!

Update: 2022-08-16 10:31 GMT
ఒక‌ప్ప‌డు సెల‌బ్రిటీలు గ‌ర్భం దాల్చితే ఎంతో?  సీక్రెట్ గా మెయింటెన్ చేసేవారు. పాపాయి జ‌న్మించిన త‌ర్వాత ఆరు నెల‌లు త‌ర్వాత వారి ఫోటోల్ని లీక్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌ర నుంచి ప్ర‌స‌వం జ‌రిగే వ‌ర‌కూ ప్ర‌తీది ప‌బ్లిసిటీ స్టంట్. వాటిద్వారానో కోట్ల రూపాయాల సంపాద‌న ఖాతాలో జ‌మ అవుతుంది.

ఫాలోయింగ్ పెర‌గ‌డంతో పాటు.. ఆదాయం రెండు స‌మ‌కూరుతున్నాయి. కొన్ని నెల‌లుగా  బేబి బంప్ ఫోటోలు మ‌రింత  ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఇప్ప‌టికే క‌రీనా క‌పూర్..కాజ‌ల్ అగ‌ర్వాల్..సోన‌మ్ క‌పూర్..ప్ర‌ణీత లాంటి బ్యూటీల బేబి బంప్ ఫోటోలు నెట్టింట ఏ రేంజ్ లో హ‌ల్చ‌ల్ చేసాయో తెలిసిందే.

నెల‌లు నిండినా వివిధ భంగిమ‌ల్లో బేబి బంప్ లుక్ తో ఫోటో సెష‌న్ లో పాల్గొని మ‌రింత  ఫేమ‌స్ అయ్యారు. ప్ర‌స్తుతం వారతా  మామ్ లు గా మారిపోయి బిడ్డ‌ల ఆల‌నా పాల‌న చూసుకుంటున్నారు.

తాజాగా బాలీవుడ్ న‌టి బిపాసా బ‌సు సైతం బేబి బంప్ లుక్ తో నెట్టింట వైర‌ల్ గా మారింది. త్వ‌ర‌లో మామ్ కాబోతున్న‌ బ్యూటీ  నెల‌లు నిండిన నేప‌థ్యంలో హ‌బ్బీ  క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ తో ఓ ఫోటో సెష‌న్ లో పాల్గొంది. వ‌దులుగా ఉండే వైట్ క‌ల‌ర్ బ్లౌజులో బిప్స్ త‌న ఎత్తైన పొట్ట‌ని ఇలా హైలైట్ చేసింది. తొమ్మిది నెల‌ల‌కు స‌మీపాన బిప్స్ వ్య‌వ‌హారం క‌నిపిస్తుంది.

పొట్ట లోపల ఉన్న బేబిని భ‌ర్త  ముద్దాడుతూ  క‌నిపించ‌గా..మ‌రో ఫోటోలో బిపాసాని హ‌త్తుకుని మ‌న‌సులో ప్రేమ‌ని చాటి చెబుతున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలో అంత‌ర్జాలంలో వైర‌ల్  గా మారాయి. బాలీవుడ్ సెబ్రిటీలు స‌హా అభిమానుల్ని ఈ సెష‌న్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.  ఇద్ద‌రి జీవితంలోకి మూడ‌వ వ్య‌క్తి రాబోతున్నారు సంతోషమంటూ సెల‌బ్రిటీలు లైక్ లు..కామెంట్లు పెడుతున్నారు.

అయితే బిపాసా గ‌ర్భం దాల్చిన‌ట్లు ఇంత వ‌ర‌కూ మీడియా లో ప్ర‌చారం త‌ప్ప అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. ఈ నేప‌థ్యంలో తాజా ఫోటో సెష‌న్ తో అన్నింటికి క్లారిటీ వ‌చ్చేసింది. అలాగే విష‌యాన్ని దంప‌తులిద్ద‌రు ధృవీక‌రించారు.  ఈ జంట 2016ల ఓ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News