నవతరం కథానాయికల ముఖాల్లో పట్టుమని పదిరకాల ఎక్స్ ప్రెషన్స్ చూడడం కష్టం. కొయ్య బొమ్మలు అందాల ఎలివేషన్‌కి ఇచ్చే ప్రాధాన్యత ఎక్స్ ప్రెషన్స్ కి ఇవ్వరన్న అపప్రద ఉంది. అయితే అలాంటి వారికి సీనియర్ నటి రమ్య కృష్ణ ఒక డిక్షనరీ అంటే అతిశయోక్తి కాదు.
అమ్మోరు.. నీలాంబరి.. శివగామి.. శైలజారెడ్డి.. ఇంకా ఎన్నో పాత్రల్లో రమ్యకృష్ణ అభినివేశం ఒక గ్రంథం లాంటిదేనని చెప్పొచ్చు. ముఖంలోనే హావభావాలతో బోలెడంత ఎమోషన్ పండించవచ్చని నిరూపించిన మేటి నటి రమ్య. అందుకే లేటు వయసులోనూ ఘాటైన పాత్రల్లో అవకాశాలు అందుకుంటూ కెరీర్‌ని సాగిస్తున్నారు. కెరీర్ తొలి నాళ్లలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ప్రోత్సాహంతో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన రమ్యకృష్ణ పరిశ్రమలో అందరు అగ్రకథానాయకుల సరసన నటించి మెప్పించారు.
చిరంజీవి - నాగార్జున - బాలకృష్ణ - వెంకటేష్ - మోహన్ బాబు వంటి అగ్ర కథానాయకుల సినిమాల్లో నటించి దశాబ్ధాల పాటు టాలీవుడ్ ని ఏలారు. ఇండస్ట్రీలో స్ఫూర్తివంతమైన మూడు దశాబ్ధాల కెరీర్ ని రమ్య కొనసాగించారంటే తనలో ఉన్న ప్రతిభ వల్లనే ఇది సాధ్యమైంది. ఈరోజుల్లో ఎందరో భామలు ఇలా వచ్చి అలా మాయమవుతున్నారు. అలా కాకూడదంటే రమ్యకృష్ణ స్థాయిలో ఎదగాలంటే ఆ ఫార్ములా ఏంటో తననే అడగాల్సి ఉంటుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లాడిన రమ్యకృష్ణకు ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శైలజారెడ్డి అల్లుడు చిత్రం సక్సెస్ ని రమ్య ఆస్వాధిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య అత్తగా ఈగోయిస్టిక్ పాత్రకు చక్కని ప్రశంసలు దక్కాయి. తదుపరి శివగామి తరహాలో మరో భారీ హిస్టారికల్ చిత్రంలో ప్రధాన నాయికగా నటించనున్నారు రమ్యకృష్ణ.