అఖిల్, చైతన్య… అప్పుడు ఇప్పుడు ఒకేలా
అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం గ్రాండ్ గా జరగబోతోంది.
అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం గ్రాండ్ గా జరగబోతోంది. ఈ పెళ్లి వేడుకకి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. ఓ వైపు అక్కినేని ఫ్యామిలీ అంతా ఈ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో అక్కినేని నాగార్జున సడెన్ గా అఖిల్ ఎంగేజ్మెంట్ అయినట్లు ప్రకటించాడు. జైనాబ్ రావ్జీ తో అఖిల్ నిశ్చితార్ధం అయ్యిందని ధృవీకరించారు. వారిద్దరి ఫోటోలని కూడా రిలీజ్ చేశారు.
గత కొంతకాలంగా అఖిల్ జైనాబ్ తో రిలేషన్ లో ఉన్నట్లు టాక్ తెరపైకి వచ్చింది. అందుకే సడెన్ గా ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో అనుకుంటున్నారు. అయితే గతంలో ఇలాగే చైతన్య, అఖిల్ కి జరిగింది. చైతన్య సమంత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కబోతున్న సమయంలో అఖిల్, శ్రియా భూపాల్ ఎంగేజ్మెంట్ చేశారు. ఆ ఫోటోలని కూడా రిలీజ్ చేశారు.
తరువాత ఏవో కారణాల వలన అఖిల్, శ్రియా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. సమంత, చైతన్య వివాహం జరిగింది. కానీ వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పుడు మరోసారి చైతన్య, శోభిత దూళిపాళ్ల పెళ్లికి మరో 10 రోజులే ఉందనగా అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఎనౌన్స్ చేశారు. అఖిల్ చేసుకోబోయే జైనాబ్ తండ్రి, నాగార్జున వ్యాపార భాగస్వాములు అని తెలుస్తోంది. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో జైనాబ్ తో అఖిల్ ప్రేమలో పడటం, రెండు కుటుంబాలకి ఒకే అనుకోని ఎంగేజ్మెంట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. వచ్చే ఏడాది అఖిల్, జైనాబ్ వివాహం జరగబోతోందని సమాచారం. ఇదిలా ఉంటే అఖిల్ కంటే జైనాబ్ 9 ఏళ్ళు పెద్ద అని ఓ టాక్ తెరపైకి వచ్చింది. సచిన్ తరహాలోనే తనకంటూ వయస్సులో పెద్ద అయిన అమ్మాయిని అఖిల్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు అఖిల్ కూడా సొంత ప్రొడక్షన్ లో మురళీ కిషోర్ దర్శకత్వంలో ఒక ప్రేమకథా చిత్రంకి ఒకే చెప్పాడు. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన రాబోతోందంట. పీరియాడికల్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కబోతోందని తెలుస్తోంది. అలాగే మరో రెండు కథలపై కూడా చర్చలు జరుపుతున్నారు.