'పుష్ప' చిత్రానికి హైలైట్ గా నిలిచే బోట్ ఫైట్..?

Update: 2021-06-15 07:30 GMT
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప' చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా బన్నీ రగ్గ్ డ్ లుక్ లో ఊర మాస్ గా కనిపిస్తున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌ ‘తగ్గేదేలే’ అంటూ యూట్యూబ్‌ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

'పుష్ప 1' చిత్రానికి సంబంధించిన మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. రెండు భాగాలుగా చేయాలని డిసైడైన సుకుమార్.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. ఈ చిత్రానికే హైలైట్ గా నిలిచే ఓ బోట్ ఫైట్ ఉంటుందనే న్యూస్ మరింత హైప్ తెచ్చిపెడుతోంది. ఇండియన్ స్క్రీన్ పై ఇంతకముందెన్నడు చూడని విధంగా ఈ బోట్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీని కోసం ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. రెండు పార్ట్స్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడే భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీ అయిన నిర్మాతలు.. బోట్ ఫైట్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట. ప్రేక్షకులకు ఈ సీక్వెన్స్ ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి.

ఇకపోతే 'పుష్ప' మొదటి భాగం పది ‘కేజీఎఫ్‌’ లతో సమానమని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు చెబుతున్నారు. హీరో ఎలివేషన్‌ సన్నివేశాలని నెక్స్ట్ లెవల్ లో చూపించిన 'కేజీఎఫ్' తో పోల్చడంతో బన్నీ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. 'పుష్ప' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Tags:    

Similar News