పవన్ ఫ్యాన్స్ నన్ను చంపేస్తారు అంటున్నాడు

Update: 2015-12-19 17:30 GMT
బొగ్గుల శ్రీనివాస్ మళ్లీ లైన్ లోకొచ్చాడండీ. పెద్ద సెలబ్రెటీ అయినట్లు నేరుగా ఇలా అనేస్తున్నారేంటి అనుకుంటున్నారా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఆ పుస్తకాన్ని రాసి వార్తల్లోకి ఎక్కినవాడే ఈ బొగ్గుల శ్రీనివాస్. ఆ పుస్తకం పట్టుకుని టీవీ9 సహా టీవీ ఛానెళ్లు తిరిగేసి పవన్ విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు బొగ్గుల శ్రీనివాస్. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నట్లు చెప్పిన బొగ్గుల శ్రీనివాస్.. ఇప్పుడు మరోసారి పవర్ స్టార్ అభిమానుల ప్రస్తావన తెస్తున్నాడు.

తనకు పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉందని.. తనకు ఇదివరకే ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయని.. ఈ నేపథ్యంలో రక్షణ కల్పించవలసిందిగా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కోరానని శ్రీనివాస్ చెప్పాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న బుక్ ఫెయిర్లో బొగ్గుల శ్రీనివాస్ కూడా ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ పుస్తకంతో ఓ స్టాల్ పెట్టుకున్నాడు. ఆ స్టాల్ కు పోలీసు రక్షణ కూడా కల్పించడం విశేషం. పవన్ మీద శ్రీనివాస్ రాసిన పుస్తకం ఇప్పటికే లక్ష కాపీలకు పైగా అమ్ముడుబోవడం గమనార్హం. మొత్తానికి పవర్ స్టార్ మీద పుస్తకంతో బొగ్గుల శ్రీనివాస్‌ కు పబ్లిసిటీకైతే ఢోకా లేనట్లే ఉంది.
Tags:    

Similar News