ట్రీట్ మెంట్ ఓవర్.. ఇర్ఫాన్ ఈజ్ బ్యాక్

Update: 2019-04-04 10:33 GMT
'పీకు'.. 'ది లైఫ్ ఆఫ్ పై'.. 'లంచ్ బాక్స్' లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ బారిన పడి లండన్లో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ లో అరుదైన హైగ్రేడ్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ కావడంతో పెయిన్ ఫుల్ గా ఉండే ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి వచ్చింది.  గత కొన్ని నెలలుగా చికిత్స తీసుకున్న ఇర్ఫాన్ తనకు పూర్తిగా నయం కావడంతో ఇప్పుడు మళ్ళీ సాధారణ జీవితంలో కి అడుగు పెడుతున్నట్టుగా వెల్లడించాడు.

ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వాయా ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు. "విజయం కోసం పరుగులు పెట్టే ప్రయత్నంలో మనకు ప్రేమ కావాలనే.. ప్రేమించబడాలనే విషయాన్ని మర్చిపోతామేమో.  కానీ ఆ విషయం మనం బలహీనులు అయిన క్షణంలోనే మనకు తెలుస్తుంది.  నా జీవితంలోని ఈ దశ జ్ఞాపకాలుగా మారుతున్న ఈ సమయంలో  మీ అందరినుండి అందుకున్న ప్రేమకు.. మద్దతుకు ఒక్క క్షణం ఇలా ఆగి మీకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అంటూ  ఒక టచింగ్ మెసేజ్ ఇచ్చాడు. "మీ దగ్గరకు తిరిగి వస్తున్నాను" అంటూ త్వరలోనే సినిమాల్లో నటిస్తున్నానే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు.
 
నిన్న ఇర్ఫాన్ ఖాన్ ఇండియాకు తిరిగి వస్తూ ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. స్లిమ్ గా ఉన్నప్పటికీ ఇర్ఫాన్ ఫిట్ గా.. హ్యాండ్ సమ్ గా కనిపించాడు.  ఇర్ఫాన్ ఫోటోలు చూసిన అభిమానుల సంతోషానికి అవధులు లేవు.  త్వరలోనే ఇర్ఫాన్ ఖాన్ 'హిందీ మీడియం 2' సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం.  2017 లో సూపర్ హిట్ అయిన 'హిందీ మీడియం' చిత్రానికి ఈ సినిమా సీక్వెల్.
Tags:    

Similar News