ఇండియాలో గత రెండు దశాబ్దాల్లో వచ్చిన అత్యుత్తమ.. ప్రపంచ స్థాయి నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకడు. బాలీవుడ్లో చిన్న సినిమాలతో ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత గొప్ప స్థాయికి ఎదిగాడతను. హాలీవుడ్లో ‘లైఫ్ ఆఫ్ పై’ - ‘జురాసిక్ వరల్డ్’ లాంటి భారీ ప్రాజెక్టుల్లోనూ అతను నటించాడు. ఇక హిందీలో ఇర్ఫాన్ చేసిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చివరగా ‘హిందీ మీడియం’ లాంటి అద్భుతమైన సినిమాను అందించిన ఇర్ఫాన్.. కొన్ని నెలల కిందట అరుదైన క్యాన్సర్ బారిన పడినట్లు వెల్లడి కావడం అతడి అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరినీ కలచి వేసింది. కొన్ని నెలలుగా లండన్‌లోనే ఉంటూ అతను చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మధ్యలో ఒకసారి చికిత్స ఎంత బాధాకరంగా సాగుతోందో వివరిస్తూ అతను పెట్టిన ఒక మెసేజ్ అందరినీ కదిలించింది.
మధ్యలో ఇర్ఫాన్ ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలొచ్చాయి. తర్వాత అప్ డేట్స్ లేవు. ఐతే తాజా సమాచారం ప్రకారం ఇర్ఫాన్ ఖాన్ కొంత మేర కోలుకున్నాడట. చికిత్స బాగానే నడుస్తోందట. అతడికి ప్రాణాపాయం తప్పిందని అంటున్నారు. దీపావళికి ఇర్ఫాన్ ఇండియా రాబోతున్నట్లుగా అతడి ప్రతినిధులు ప్రకటించారు. ముంబయికి వచ్చి దీపావళి వేడుకల్లో ఇర్ఫాన్ పాల్గొంటాడని చెబుతున్నారు. అతను ‘హిందీ మీడియం’ సీక్వెల్లో కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది కానీ.. అలాంటిదేమీ లేదనే అంటున్నారు. ఐతే ఇర్ఫాన్ మళ్లీ సినిమాల్లో నటించడం సంగతి తర్వాత. ముందు అతను కోలుకుని మామూలు మనిషి అయితే చాలని కోరుకుంటున్నారు అభిమానులు. అనారోగ్యం నుంచి పూర్తిగా బయటపడితే తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచించొచ్చు. మరి దీపావళి నాడు ఇర్ఫాన్ ఎలా కనిపిస్తాడు అని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.