బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈమద్య కాలంలో వరుసగా అభిమానులను మరియు ప్రేక్షకులను నిరాశ పర్చుతూ వస్తున్నాడు. గత అయిదు ఆరు సంవత్సరాల్లో ఈయన చేసిన ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకున్న పాపన పోలేదు. ఇలాంటి సమయంలో ఆయన దాదాపు రెండేళ్ల గ్యాప్ ను తీసుకున్నాడు. కరోనాతో మరో ఏడాది గ్యాప్ వచ్చేసింది. ఈ కరోనా పోయిన వెంటనే కొత్త సినిమాను మొదలు పెట్టాలని షారుఖ్ భావిస్తున్నాడు. అందుకోసం తన 2017 చిత్రం 'రీస్' కు సీక్వెల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
సౌత్ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ఈ సీక్వెల్ ను ఆయన చేయబోతున్నాడట. ఈ విషయం కాస్త ఆశ్చర్యంగా ఉంది. కాని ఇది నిజం అంటూ బాలీవుడ్ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. షారుఖ్ ఖాన్ చేసిన ఆ సినిమా కమర్షియల్ గా నష్టపర్చినా కూడా అప్పట్లో సినిమా గురించి పతాక స్థాయిలో చర్చ జరిగింది. సినిమాను చాలా మంది పాజిటివ్ గా చెప్పారు. అయితే కమర్షియల్ గా సినిమా నిరాశపర్చడంతో ఫ్లాప్ జాబితాలోకి చేరిపోయింది.
ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో సినిమాను తీయాలని దానికి సీక్వెల్ కథను రెడీ చేశారని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ గత రెండు మూడు సంవత్సరాలుగా అట్లీతో సినిమా చేయాలని ఆశపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో అది నెరవేరబోతుంది. అయితే ఫ్లాప్ మూవీ సీక్వెల్ అంటే ఖచ్చితంగా సినిమాపై మొదట్లోనే బ్యాడ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉందని అంటున్నారు. కనుక ఖచ్చితంగా సినిమా భారీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అంటున్నారు.