భారీ క్రేజ్ వున్న సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లలో అప్పటి వరకు హవా కొనసాగిస్తున్న సినిమాల ప్రభావం తగ్గుతూ వుంటుంది. కొన్నింటిని మేకర్స్ ఇక ఫలితం లేదని థియేటర్ల నుంచి తొలగిస్తూ వుంటారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఎంత పెద్ద క్రేజీ మూవీ బరిలో దిగినా దాన్ని తట్టుకుని నిలబడుతూ వుంటాయి. బాలీవుడ్ రీమేక్ `దృశ్యం 2` విషయంలోనూ అదే జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. మలయాళంలో రూపొందిన `దృశ్యం 2`, తెలుగు, కన్నడ భాషల్లోనూ భారీ విజయాన్ని దక్కించుకుంది.
ఇదే మూవీని హిందీలో అజయ్ దేవగన్, టబు, శ్రియా కీలక పాత్రల్లో టి సిరీస్ వారు రీమేక్ చేశారు. ఈ మూవీతో బాలీవుడ్ కు పూర్త వైభవం వస్తుందా? అని ఆశగా ఎదురు చూసిన వారికి గుడ్ న్యూస్ చెబుతూ భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 326 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ఔరా అనిపించింది. ఇక బాలీవుడ్ హిట్ అనే మాట వినదా? అని నిరాశలో వున్న బాలీవుడ్ మేకర్స్ లో సరికొత్త జోష్ ని నింపింది.
ఈ మూవీతో ఇక బాలీవుడ్ రీమేక్ లకు స్వస్థి చెప్పాల్సిందేనా అంటూ అనుమానంగా చూసిన మేకర్స్ కి `దృశ్యం 2` ఆ అనుమానాల్ని పటాపంచలు చేసింది. బాక్సాఫీస్ వద్ద ప్రతికూల పరిస్థితులు తలెత్తినా ఇప్పటికీ అదే హవాని కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. `అవతార్ 2` సినిమాతో ఈ మూవీకి బ్రేక్ పడటం ఖాయం అని అంతా భావించారు. కానీ `అవతార్ 2` ప్రభంజనాన్ని కూడా తట్టుకుని బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
ఇక రణ్ బీర్ సింగ్, రోహిట్ శెట్టిల కలయికలో విడుదలైన `సర్కస్` తో బ్రేక్ కాయం అన్నారంతా.. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకోవడంతో `దృశ్యం 2` ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లని రాబడుతూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అంతే కాకుండా రీమేక్ సినిమాలపై వున్న అపోహని తొలగిస్తూ వారంతంలో కోటికి పైగా కలెక్షన్ లని సొంతం చేసుకుంటోంది.
`దృశ్యం 2` జోరు చూస్తుంటే షారుక్ ఖాన్ `పఠాన్` రిలీజ్ అయ్యే వరకు ఇదే హవాని కొనసాగించేలా వుందని ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2023 జనవరి 23న `పఠాన్` రిలీజ్ కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.