తెలుగు దర్శకుడనా ఈ ట్రీట్ మెంట్?

Update: 2019-05-14 04:22 GMT
తెలుగులో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ ట్రైలర్ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మిలియన్ వ్యూస్ దాటేసి సంచలనం సృష్టించిన దీని గురించి అక్కడి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక సౌత్ సినిమా ఒరిజినల్ ఫ్లేవర్ చెడిపోకుండా మొత్తం ఇతర నటీనటులతో తెరకెక్కించిన తీరు గురించి మాట్లాడుకుంటున్నారు.

నిన్న ట్రైలర్ విడుదల సందర్భంగా బాలీవుడ్ మీడియా వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. ప్రెస్ మీట్ లో భాగంగా టీమ్ ప్రెస్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు సదరు ప్రతినిధులు ప్రశ్నలను ఎక్కువగా షాహిద్ కపూర్ ని ఆ తర్వాత కియారా అద్వానీని అడిగేందుకు మొగ్గు చూపడం లైవ్ గా దొరికిపోయింది. దీనికి సృష్టికర్త అయిన దర్శకుడు అక్కడ ఉన్నాడన్న స్పృహ లేకుండా ప్రశ్నల పరంపరను హీరో హీరోయిన్ల మీద కొనసాగించడం ఇప్పుడు కొత్త కోణంలో చర్చను లేవనెత్తింది

కేవలం సందీప్ రెడ్డి వంగా సౌత్ నుంచి వచ్చిన దర్శకుడని ఇలా ట్రీట్ చేశారా లేక అవగాహనా లేక ఇలా ప్రవర్తించారా అనే అనుమానాలు వస్తాయి. నిజానికి సందీప్ వంగా వారికేమి అపరిచితుడు కాదు. అర్జున్ రెడ్డి టైంలోనే అతని టాలెంట్ గురించి తెలిసి వచ్చింది. దానికి సంబంధించిన కథనాలు కూడా జాతీయ మీడియాలో  విరివిగా వచ్చాయి. ఇప్పుడు అవేవి లేవు అనేలా ప్రవర్తించడం వింతే.

మధ్యలో ఓ జర్నలిస్ట్ సందీప్ ను ప్రశ్న అడిగి సమాధానం కోసం వేచి చూడకుండానే హీరో వైపు డైవర్ట్ కావడం మీడియా దృష్టి దాటి పోలేదు. షాహిద్ కపూర్ చాలా నయం. పదే పదే సందీప్ ప్రస్తావన తీసుకువచ్చి తను లేకపోతే కబీర్ సింగ్ పట్టాలు ఎక్కేది కాదన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వచ్చేనెల 21న విడుదల కానున్న కబీర్ సింగ్ మీద ఇప్పటికే హిందీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి
Tags:    

Similar News