ఈ బాలీవుడ్డోళు్ల ఉన్నారే.. వీళ్ళకు ఇప్పుడు ప్రభాస్ మాంచి మేతలా తయారయ్యాడు. బాహుబలి గురించి ఏ న్యూస్ వేసినా.. ప్రభాస్ గురించి ఏ వార్త రాసినా.. అది పెద్ద న్యూస్ అయ్యి కూర్చుంటుంది. అందుకే మనోళ్ళు ప్రభాస్ గురించి రోజూ ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా మనోడి మ్యారేజ్ టాపిక్ కూడా ఒక సంచలనాత్మకమైన న్యూస్ గా మారిపోయింది.
ఇప్పటికే తాను బాహుబలి 2 కూడా పూర్తయ్యే వరకు పెళ్ళి చేసుకోనని.. అలా చేస్తే అటు కట్టుకున్న భార్యకూ ఇటు కసిగా రూపొందిస్తున్న బాహుబలికి అన్యాయం చేసిన వాడనే అవుతానని చెప్పుకొచ్చాడు. కాని బాలీవుడ్ లో మాత్రం మనోడు భీమవరంకు చెందిన ఒక అమ్మాయిని ఓకె చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. 36 ఏళ్ళ ప్రభాస్ మన షాహిద్ కపూర్ తరహాలో ఒక 22 ఏళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని అక్కడ రూమర్లను చెక్కేస్తున్నారు జనాలు. వయస్సుది ఏముందిలే అనుకున్నా.. అసలు భీమవరం పిల్ల అంటూ బాలీవుడ్డోళ్ళు ప్రచారం చేయడం మాత్రం కామెడీగా ఉంది.
ఇదే విషయంపై ప్రభాస్ ను కదిలిస్తే.. ముందు బాహుబలి 2 రానివ్వండి.. ఆ తరువాతే ఏ పెళ్ళయినా.. అంతవరకు అస్సలు ఆ టాపిక్ తీయకండి డార్లింగ్స్ అంటున్నాడు. బాబూ బొంబాయ్ మీడియా.. ఇది కూడా రాసుకోండి మరి.