మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి `RRR` లో నటించిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మూవీ పూర్తయిన వెంటనే రామ్ చరణ్ దిగ్రేట్ డైరెక్టర్ శంకర్ సినిమా షూటింగ్లో బిజీ అయిపోయాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ కలిసి భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న 50 వ సినిమాగా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
ఇప్పటికే పలు కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చారు. దీంతో హీరో రామ్ చరణ్ తన వైఫ్ ఉపాసనతో కలిసి ఇటలీకి విహార యాత్రకు వెళ్లారు. సన్నిహితులు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ తమ 10 వ వివాహ వార్షికోత్సవ వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందు కోసం చరణ్ ఇటలీ వెళుతూ హైదరాబాద్ విమానాశ్రయంలో ఫొటోగ్రాఫర్లకు చిక్కారు.
అయితే చరణ్ వేసుకున్న ఫంకీ డెనిమ్ జాకెట్ ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ప్రతీ ఒక్కరి దృష్టిని ఈ జాకెట్ ఆకర్షించింది. వైట్, రెడ్ , బ్లాక్ కలర్ ల కాంబినేషన్లో వున్నా ఈ జాకెట్ పై రా 27 అని రాసి వుండటం స్పెషల్ ఎట్రాక్షన్ గా వుంది.
ఈ డెనిమ్ జాకెట్ ని నిఖితా జై సింఘానియా డిజైన్ చేసింది. అంతే కాకుండా `రా 27` హైలైట్ కావడం వెనక చరణ్ వ్యక్తిగత జీవితానికి దీనికి చాలా దగ్గరి సంబంధం వున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీని కాస్ట్ ఎంతా? అన్నది ఇప్పడు బాలీవుడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
రెడ్ , బ్లాక్ , అండ్ వైట్ కలర్ డెనిమ్ జాకెట్ కాస్ట్ 2.500 డాలర్లని అంటే మన కరెన్సీలో చూస్తే దీని విలువ దాదాపు రెండు లక్షలు వుంటుందని తెలిసింది. ఈ డెనిమ్ జాకెట్ తో పాటు చరణ్ కార్గో పాంట్.. హైలీ కాస్ట్లీ షూస్ .. బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి డాపర్ లుక్ లో కనిపించి అదరగొట్టేశాడు. పదేళ్ల క్రితం 2012 జూన్ 14న రామ్ చరణ్ - ఉపాసనల వివాహం జరిగింది. ఈ ఏడాది జూన్ 14కు వీరి వివాహం జరిగి పదేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ జంట ఇటలీలో పదవ మ్యారేజ్ యానివర్సరీని ఘనంగా జరుపుకుంది.