పాకిస్థాన్ లో పుట్టి పెరిగిన సింగర్ అద్నాన్ సమీ ఆ తర్వాత భారత పౌరసత్వాన్ని తీసుకొని ఇండియాలోనే రెగ్యులర్ సింగర్ గా బిజీ అయిపోయాడు. ఎంతో కష్టపడి సింగర్ గా ఎదిగిన సమీ తన జీవితంలో కొన్ని చేదు అనుభవాలను కూడా చూశాడు. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ విషయంలో అతని ప్రేమ వివాహారాలు విడాకుల వివాదాలు కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి.
మొదటి భార్యతో విడాకులు తీసుకొని రెండవ పెళ్లి చేసుకున్న అతను ఆ తర్వాత కొన్నాళ్లకే రెండో భార్యకు కూడా విడాకులు ఇచ్చాడు. ఇక మళ్ళీ మొదటి భార్యతో సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకున్న సమీ ఆ తర్వాత మళ్లీ కొన్ని నెలలకే ఆమెతో విడిపోయాడు. ఇక ప్రస్తుతం ఒక మాజీ ఇండియన్ సైనిక అధికారి కూతురితో అతను దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.
అయితే ఒక సమయంలో ఈ ప్రముఖ సింగర్ అధిక బరువు కారణంగా చావు అంచుల వరకు వెళ్లి వచ్చినట్లుగా చెప్పాడు. దాదాపు 250 కేజీల బరువు పెరగడంతో లండన్ లో ప్రత్యేకంగా చికిత్స తీసుకోవాలని సమీ అనుకున్నాడు. అయితే వైద్యులు అతని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. నువ్వు మరొక నెలల్లో కూడా చనిపోవచ్చు అని అనడంతో వెంటనే అతను తన లైఫ్ స్టైల్ లో మార్చేసుకున్నాడు.
డాక్టర్స్ సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకొని కేవలం 18 నెలల్లోనే 130 కేజీల బరువు తగ్గే విధంగా అతను వ్యాయామలు ఆహారపు అలవాట్లను మార్చుకున్నాడు. ఇక అతని లుక్కు మారిన తర్వాత చాలామంది చూసి ఆశ్చర్యపోయారు. సర్జరీ చేయించుకుని ఉండవచ్చు అని అనుకున్నారు.
కానీ అలాంటిదేమీ లేకుండా నాచురల్ గానే అతను వ్యాయామాలు చేసి ఆహార అలవాట్లు మార్చుకొని తన బరువుని తగ్గించుకున్నాడు. ఇక తెలుగులో అతను ఎక్కువగా అయితే దీవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సినిమాలలో పాటలు పాడారు. వర్షం సినిమాలో నచ్చావే నైజాం పోరి అనే పాట ద్వారా అతని తెలుగు ప్రస్థానం మొదలైంది. ఇక జులాయి సినిమాలో ఓ మధు అనే పాటతో కూడా అతను మంచి గుర్తింపు అందుకున్నాడు.