మొన్నటికి మొన్న గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో బైక్ పై షికార్ చేస్తున్న ఫోటో అంతర్జాలంలో వైరల్ అయ్యింది. ఇంతలోనే సుశాంత్ అంతర్ధానం అయ్యాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలతో ఆదివారం మధ్యాహ్నం బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతిలోకి వెళ్లింది. ఆరంభం ఈ మరణంపై ఎలాంటి అనుమానాల్ని పోలీసులు వ్యక్తం చేయలేదు. ఆత్మహత్య మాత్రమేనని ప్రకటించారు మీడియాకి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కచ్చితమైన సమాచారం తెలుస్తుందని తెలిపారు.
ఘటనకు పూర్వం ఉదయం నుంచి ఏం జరిగింది? అన్నది పరిశీలిస్తే.. సంఘటన జరిగిన రోజు ఉదయం 6-6: 30 గంటలకు ఎప్పటిలానే ఎర్లీగానే మేల్కొన్నాడు. లేవగానే తన గది నుండి బయటకు వచ్చాడు. ఉదయం 9:30 గంటలకు ఆయనకు దానిమ్మ రసం వచ్చింది. ఉదయం 10:30 గంటలకు అతని కుక్స్ భోజనానికి ఏం చేయాలో అడిగేందుకు వెళ్లారు. కానీ అతను గది నుండి బయటకు రాలేదు. తలుపులపై కొట్టినా ఆ శబ్ధాలకు అతడు స్పందించలేదు.
మార్నింగ్ 11-11: 30 గంటలకు వంటవాళ్లు.. సహాయకుల సిబ్బంది మళ్లీ తలుపు తట్టారు. కానీ స్పందన లేదు. రాజ్‌పుత్ సిబ్బంది అతని మొబైల్ ఫోన్ కు కూడా ఫోన్ చేసినా స్పందన రాలేదు. అనుమానంతో వెంటనే ముంబైలో నివసిస్తున్న రాజ్‌పుత్ సోదరిని రమ్మని కోరారు. సోదరి వచ్చిన తర్వాత ఒక కీ మేకర్ ను పిలిచారు. మధ్యాహ్నం 1:15 గంటలకు కాల్ చేయగా.. కీ మేకర్ మధ్యాహ్నం 1:30 గంటలకు ఇంటికి చేరుకుని తలుపు తెరిచారు
తలుపులు తెరవగానే అక్కడ దృశ్యానికి అంతా షాక్ తిన్నారు. రాజ్‌పుత్ పైకప్పు నుండి వేలాడుతూ కనిపించాడు. అతను కుర్తాతో ఉరేసుకుని కనిపించాడు. సిబ్బంది మృతదేహాన్ని కిందకు దించి.. ఆ కుర్తాను కత్తిరించారు. సిబ్బంది అంబులెన్స్ కు ఫోన్ చేసారు. అప్పటికి పోలీసులు చేరుకున్నారు.