గత కొంత కాలంగా ఇండియన్ సినిమాలకు అమెరికాలో మంచి బిజినెస్ అవ్వడంతో పాటు, మంచి వసూళ్లు కూడా నమోదు అవుతున్నాయి. అన్ని భాషల సినిమాలు కూడా ఓవర్సీస్ లో భారీగా వసూళ్లు నమోదు చేస్తున్నాయి. అయితే చైనాలో అతి కొద్ది సినిమాలు మాత్రమే అక్కడి ప్రేక్షకులను మెప్పించి వసూళ్లను రాబడుతున్నాయి. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ మూవీ అక్కడ నిరాశ పర్చింది. చైనాలో దంగల్ సంచలన విజయాన్ని నమోదు చేయగా బజరంగీ భాయిజాన్ మరియు హిందీ మీడియం అనే చిత్రాలు అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రాల జాబితాలో అంధధున్ అనే హిందీ చిత్రం కూడా నిలిచింది.
గత ఏడాది బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్న చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కేవలం 32 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం వంద కోట్ల వరకు రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రం చైనాలో విడుదలై మొదటి వారం రోజుల్లోనే 100 కోట్ల రూపాయలను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. చైనా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. 'పియానో ప్లేయర్' అనే టైటిల్ తో చైనాలో ఈ చిత్రం విడుదల అయ్యింది.
ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా రాధిక ఆప్టే నటించింది. ఇక కీలక పాత్రలో టబు ఈ చిత్రంలో నటించడం జరిగింది. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం చైనా ప్రేక్షకులను ఇంతగా మెప్పిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఊహించి ఉండరు. మొత్తానికి కేవలం 32 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం అక్కడ, ఇక్కడ అన్ని ఏరియాల వసూళ్లు కలిపి 32.25 కోట్లు నమోదు అయ్యాయి.