మరో ప్రముఖ హీరో ఇంటికి బాంబ్ బెదిరింపు.. !!

Update: 2020-07-18 18:03 GMT
సౌత్ ఇండియన్ ప్రముఖ సినీ హీరో అజిత్‌ ఓ ఆగంతకుడి వలన భయాందోళనకు గురయ్యాడు. తన ఇంటికి ఎవరో బాంబు పెట్టి లేపేస్తామని కాల్‌ చేసి బెదిరించినట్లు సమాచారం. ఈ విషయం వెంటనే పోలీసులకు చేరడంతో వారు అప్రమత్తమయ్యారు. చెన్నైలోని ఇజంబక్కంలో అజిత్ నివాసం చుట్టుపక్కల చెన్నై స్థానిక పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీ పూర్తి కావడానికి మరో రెండు గంటల సమయం పడుతుందని పోలీసులు తెలిపారు. జూలై 18న అంటే ఈరోజు అజిత్‌ ఇంటిలో బాంబు పెట్టినట్లు ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్‌ రూంకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంటనే కాల్ కట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి కాల్ కట్ చేయగానే పోలీసులు వెంటనే బాంబు స్వాడ్‌తో అజిత్‌ ఇంటికి చేరుకుని సోదాలు చేశారు.

ప్రస్తుతం అజిత్ ఇంట్లో బయట, చుట్టుపక్కల తనిఖీ కొనసాగుతోందని సమాచారం. అయితే ఆ ఫోన్‌కాల్‌ ఎవరు చేశారు..? ఎక్కడి నుండి చేసారు?  మాట్లాడింది ఎవరు..? అనే అంశాల పై ప్రత్యేక దృష్టి సారించి అలాగే ఇలా ఎందుకు చేసారో.. కారణాలను త్వరలోనే వెలుగులోకి తీసుకొస్తామని ఉన్నత అధికారులు పేర్కొన్నారు. అంతలోనే ఈ ఫోన్‌ కాల్‌ తమిళనాడులోని విల్లుపురం జిల్లా నుంచి వచ్చిందని గుర్తించారు పోలీసులు. అయితే అది ఖచ్చితంగా చెప్పలేమని.. త్వరలో ఖచ్చితమైన లొకేషన్‌ను గుర్తించి ఆ అగంతకుడిని క్యాచ్ చేస్తామని తీసుకుంటామని పోలీసులు వివరించారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య హీరో విజయ్‌, రజనీకాంత్‌ల‌కు కూడా జరిగిన సంగతి తెలిసిందే.

ఇలాగే ఇంట్లో బాంబు‌ పెట్టినట్లు బెదరింపు కాల్‌ వచ్చేసరికి హీరోలు త్వరగా రియాక్ట్ అయి పోలీసులను అలెర్ట్ చేశారు. ఆ దుండగులను పట్టుకున్నారు కూడా.. అయితే హీరో విజయ్‌ ఇంటికి వచ్చిన బెదిరింపు కాల్‌ కూడా విల్లుపురం జిల్లా నుండి రావడం అనుమానాలకు దారితీస్తుంది. అయితే ఆ కాల్‌ను భువనేశ్వర్‌ అనే మతిస్థిమితం లేకుండా అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి చేసాడని పోలీసులు గుర్తించారు. కానీ అతడి కుటుంబ సభ్యులు పోలీసులను క్షమాపణ కోరారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అజిత్‌.. ఖాకి ఫేమ్ హెచ్‌. వినోత్‌ దర్శకత్వంలో 'వాలిమై' అనే సినిమా చేయనున్నాడు. ఆ సినిమాను బాలీవుడ్ నిర్మాత బోణికపూర్‌ నిర్మిస్తున్నట్లు సమాచారం.
Tags:    

Similar News