ఖుష్బూ ఇంట్లో బాంబు క‌ల‌క‌లం

Update: 2017-05-07 04:11 GMT
త‌మిళ న‌టి.. రాజ‌కీయ నాయ‌కురాలు ఖుష్బూ సుంద‌ర్ ఇంట్లో బాంబు పెట్టార‌న్న వార్త క‌ల‌క‌లం రేపింది. చెన్నైలోని ఖుష్బు.. ఆమె భ‌ర్త సుంద‌ర్ నివ‌సించే ఇంట్లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆమెను బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఖుష్బూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంట‌నే పోలీసులు బాంబు స్క్వాడ్.. జాగిలాల‌తో త‌నిఖీ నిర్వ‌హించారు. ఇంట్లో అణువ‌ణువునా క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఐతే ఎక్కడా బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు లభించలేదు. దీంతో అంద‌రూ హ‌మ్మ‌య్య అనుకున్నారు. ఎవ‌రో ఆక‌తాయిలు కావాల‌నే ఈ ఫోన్ చేసి ఉంటార‌ని అనుకుంటున్నారు.

కొన్నేళ్లుగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరిన త‌ర్వాత చాలా దూకుడుగా ఉంటోంది. ఆ పార్టీలో ఆమె అగ్ర నేత‌గా చెలామ‌ణి అవుతున్నారు. గ‌త కొంత కాలంగా ఆమె కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌నతా పార్టీని తీవ్రంగా విమ‌ర్శిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆమెకు వ‌చ్చిన బాంబు బెదిరింపు కాల్ ను పోలీసులు సీరియ‌స్ గానే తీసుకున్నారు. తాను బాగానే ఉన్నాన‌ని, త‌న‌కేం కాలేద‌ని ఖుష్బు ట్విట్ట‌ర్లో వెల్ల‌డించ‌డంతో ఆందోళ‌నలో ఉన్న అభిమానులు శాంతించారు. ఖుష్బు ఇటీవ‌లే త‌న భ‌ర్త పిల్ల‌ల‌తో క‌లిసి యూర‌ప్ ప‌ర్య‌ట‌నకు వెళ్లి వ‌చ్చారు. ఇంత‌లోనే ఆమెను బాంబు వార్త భ‌య‌పెట్టింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News