వ‌ర్మ‌ను వెంటాడుతున్న బొమ్మాళీ

Update: 2019-11-01 10:15 GMT
నిరంత‌రం ఏదో ఒక వివాదంతో అంట‌కాగే ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం 'క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఈ సినిమా ప్ర‌చారం కోసం వెంప‌ర్లాడుతుంటే మ‌రోవైపు అత‌డిపై పోలీస్ కేసులు ఉరిమి చూస్తున్నాయి. ఆర్జీవీ తెర‌కెక్కించిన జీఎస్టీ యూట్యూబ్ సిరీస్ భూతం అత‌డిని ఇంకా వెంటాడుతూనే ఉంది. బూతును.. పోర్నోగ్ర‌ఫీని ప్రోత్స‌హిస్తూ ఆర్జీవీ చేసిన ఈ ప్ర‌య‌త్నంపై అప్ప‌ట్లో మ‌హిళా మండ‌ళ్లు విరుచుకుప‌డ్డాయి. అత‌డిపై ప‌లుచోట్ల కేసులు న‌మోదు చేశారు. ఆ క్ర‌మంలోనే మ‌హిళా మండ‌లి నాయ‌కురాళ్ల‌పై ఇష్టానుసారం మాట్లాడి ఆర్జీవీ ఇరుక్కుపోయాడు. అత‌డిపై స‌ద‌రు మ‌హిళామ‌ణులు పోలీస్ కేసులు పెట్ట‌డంతో వాటిపై విచార‌ణ సాగుతోంది.

అప్ప‌ట్లోనే ఆర్జీవీపై సైబ‌ర్ క్రైమ్ స‌హా ఫోరెన్సిక్ నిపుణులు ఆరాలు తీశారు. ఆయ‌న నుంచి ల్యాప్ టాప్ లాక్కుని అత‌డు ఎక్క‌డి నుంచి ఆ పోర్నోగ్ర‌ఫీ వీడియోని అప్ లోడ్ చేశాడు? అంటూ పరిశోధించారు. గంట‌ల కొద్దీ స‌మ‌యం వెచ్చించి ఆర్జీవీని సైబ‌ర్ పోలీసులు విచారించారు. అయితే అత‌డి నుంచి స‌రైన ఆన్స‌ర్ రాలేదు స‌రిక‌దా తిక్క తిక్క స‌మాధానాల‌తో బెంబేలెత్తించాడ‌ని మాట్లాడుకున్నారు. మొత్తం జీఎస్టీ షూటింగ్ పోల్యాండ్ లో చేశాను. అస‌లు ఫిలిం షూటింగ్ జ‌రిగిన‌ప్పుడు షూటింగ్ స్పాట్ లోనే లేను అని ఆర్జీవీ పోలీసుల‌కు చెప్పాడు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా డైరెక్ష‌న్ చేశాన‌ని తెలిపాడు. అత‌డు చెప్పేది న‌మ్మ‌ని పోలీసులు .. వేలిముద్ర‌ల నిపుణులు జీఎస్టీ ని యూట్యూబ్ లో ఎలా పోస్ట్ చేశారు? ఎక్క‌డి నుంచి అప్ లోడ్ చేశారు? అన్న‌దానిపై ప‌రిశోధ‌న చేస్తున్నారు.

అయితే పోలీసుల‌కు ఆ డేటాను ఇచ్చేందుకు సోష‌ల్ మీడియా కార్పొరెట్ బాబులు నిరాక‌రించ‌డంతో కేసు ఝ‌టిల‌మైంది. 2018లోనే ఆర్జీవీపై ఈ కేసు న‌మోదైంది. అప్ప‌టి నుంచి విచార‌ణ అలా సాగుతూనే ఉంది. అయితే కేసుల నుంచి అత‌డు బ‌య‌ట‌ప‌డ‌డం అంత సులువేమీ కాదు. నేరం రుజువైతే శిక్ష తీవ్రంగానే ఉంటుంది. ప్ర‌స్తుతానికి రుజువు అవ్వ‌డం అన్న‌దే స‌స్పెన్స్ గా మారింది. ఉద్ధేశ పూర్వ‌కంగా బూతు సినిమాలు తీయ‌డం.. బూతుతో రెచ్చ‌గొట్ట‌డం.. వ‌గైరా వ‌గైరా భార‌త‌దేశంలో నిషేధం. దీనిపై క‌ఠిన‌మైన సెక్ష‌న్లు ఉన్నాయి. మ‌రి వ‌ర్మ వీటినుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడు? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News