బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన దర్శకుడు భాస్కర్ కు ఆ తర్వాత రెండు `మెగా` ప్రాజెక్టులు దక్కాయి. తన తొలి సినిమాకే `నంది`ని అందుకున్న భాస్కర్ ...ఇద్దరు మెగా హీరోలతో వరుసగా సినిమాలు చేశాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన `పరుగు` ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే, ఆ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత... మగధీర వంటి కెరీర్ బెస్ట్ హిట్ తో మంచి ఊపుమీదున్న మెగా హీరో రామ్ చరణ్ తో `ఆరెంజ్` ను తీశాడు. అయితే, ఆ చిత్రం చెర్రీ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. ఆ అనుభవాలతో రూటు మార్చిన భాస్కర్ రామ్ హీరోగా `ఒంగోలు గిత్త` వంటి మాస్ మసాలా చిత్రాన్ని తెరకెక్కించినా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో, భాస్కర్ కొన్నాళ్ల నుంచి సైలెంట్ అయిపోయాడు.
అయితే, ఒంగోలు గిత్త తో నష్టపోయిన నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ కు మరో సినిమా చేస్తానని భాస్కర్ మాటిచ్చాడట. కార్తీ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని నిర్మించేందుకు భాస్కర్ ప్లాన్ చేసినా అది వర్కవుట్ కాలేదట. ఆ తర్వాత వెంకీకి ఓ కథ వినిపించినా అది ఫైనల్ కాలేదట. దీంతో, దిక్కుతోచని స్థితిలో ఉన్న భాస్కర్ కు `మెగా` ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నుంచి పిలుపు వచ్చిందట. దీంతో, గీతా ఆర్ట్స్ బ్యానర్ కోసం భాస్కర్ ఓ సరికొత్త స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో పడ్డాడట. అయితే, ఈ చిత్రంలో హీరో అన్న సంగతి ఇంకా ఫైనల్ అవ్వలేదు. కొంతకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ ఈ చిత్రంలో నటించే అవకాశముందని టాక్.