అక్కినేని అఖిల్ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోని సినిమా సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. జీఏ2 బ్యానర్ పై బన్నీవాసు- అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో అఖిల్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చి నాగార్జునకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని భాస్కర్- అరవింద్ పంతంతో ఉన్నారట. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. అంతేకాదు.. గుట్టు చప్పుడు కాకుండా .. ఆన్ లొకేషన్ విషయాలేవీ బయటకు లీక్ కాకుండా చిత్రబృందం ఎంతో జాగ్రత్తపడుతున్నారు.
ఇప్పటివరకూ అఖిల్ 4కి సంబంధించిన సరైన అప్ డేట్ ఏదీ లేదు. వివరాలేవీ వెల్లడించకుండా రహస్యాన్ని మెయింటెయిన్ చేస్తోంది టీమ్. అయితే వెబ్ లో మాత్రం రకరకాలుగా ప్రచారం సాగిపోతోంది. ఇది రొమాంటిక్ లవ్ స్టోరి అని.. రొమాంటిక్ కామెడీ జానర్ అని ప్రచారమైంది. అయితే తాజాగా స్టోరీ నేపథ్యానికి సంబంధించిన ఓ లీకు అందింది. అమెరికాలో ఉన్న అఖిల్ తన కలల రాకుమారిని పెళ్లి చేసుకోవడం కోసం ఇండియాకు వస్తాడుట. పెళ్లిని జీవితంలో అతి పెద్ద బాధ్యతగా ఫీలై...పెద్దలపై తనకున్న గౌరవాన్ని కాపాడుతూ... ప్రేమలోని ఔన్నత్యాన్ని గెలిపిస్తూ చివరికి పెళ్లాడి చూపించి వైవాహిక బంధం గొప్పతనాన్ని నిలబెడతాడు! అన్నదే సింగిల్ లైన్ కథాంశం అని చెబుతున్నారు. ఫ్యామిలీ ఎమోషనని హైలైట్ చేస్తూ... తెలుగు ఆడియన్స్ కు కావాల్సిన అన్ని అంశాలను టచ్ చేస్తూ పక్కా కమర్శియల్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారని సమాచారం.
దీన్ని బట్టి భాస్కర్ స్క్రిప్ట్ విషయంలో రిస్క్ తీసుకోకుండా సేఫ్ జానర్ లోనే వెళుతున్నాడని అర్థమవుతోంది. తనకు వర్కవుటైన బ్రాండ్ ఫ్యామిలీ ఎమోషన్ ని హైలైట్ చేస్తూ అక్కినేని ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట. అక్కినేని ఫ్యామిలీ హీరోలందరికీ లేడీ ఫాలోయింగ్...ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. సరిగ్గా ఆ పాయింట్ నే భాస్కర్ టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అఖిల్ తో రిస్క్ తీసుకోకుండా రొటీన్ ఫ్యామిలీ కాన్సెప్ట్ తోనే ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం అఖిల్-భాస్కర్ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి కమర్శియల్ స్క్రిప్ట్ సేఫ్ అని ఎనలిస్టులు సైతం అభిప్రాయడుతున్నారు.