అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం, అనంతర సంఘటనల గురించి తెలిసిందే. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో కజిన్ పెళ్లి వేడుకలో మరణించడం సంచలనమైంది. బాత్ టబ్ లో కాలు జారి మరణించారని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దానిని అభిమానులెవరూ నమ్మలేదు. ఇప్పటికీ నమ్మడం లేదు. అది ఇంకా అనుమానాస్పద మృతిగానే అభిమానులు పరిగణిస్తున్నారు. ఆ ఘటన గురించి ఇంకా తలుచుకుంటుండగానే అప్పుడే తొలి వర్ధంతి పూర్తయింది. అది కూడా ప్రేమికుల దినోత్సవం రోజున (ఫిబ్రవరి14) శ్రీదేవి డెత్ యానివర్శరీ చేయడం ప్రముఖంగా చర్చకొచ్చింది.
నిన్నటి రోజున చెన్నయ్ మైలాపూర్ లో జరిగిన శ్రీదేవి డెత్ యానివర్శరీ కార్యక్రమానికి శ్రీదేవి భర్త.. నిర్మాత బోనీ కపూర్ సహా జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని తమిళ స్టార్ హీరో, శ్రీదేవి సన్నిహితుడు అజిత్ దగ్గరుండి మరీ జరిపించారు. అజిత్, అతడి వైఫ్ శాలిని, `ఇంగ్లీష్ వింగ్లీష్` దర్శకుడు గౌరీషిండే, దర్శకుడు ఆర్ ఆర్ బాల్కీ, అనీల్ కపూర్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.
ఏడాది గడిచినా ఇంకా శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించలేదని అభిమానులు నమ్ముతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అదంతా అటుంచితే శ్రీదేవిని బోనీ కపూర్ 1996 లో పెళ్లి చేసుకున్నారు. వారిది ప్రేమ వివాహం. పైగా రెండో వివాహం కావడంతో ఆ తర్వాత ఎన్నో పరిణామాలు శ్రీదేవికి ఇబ్బందికరంగా మారాయని సన్నిహితులు చెబుతారు. శ్రీదేవి మరణం వరకూ బోని మొదటి భార్య కుమారుడు, హీరో అర్జున్ కపూర్ తనకు అస్సలు సన్నిహితంగా లేనేలేడు. మరణానంతరం మాత్రం శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషీలను దగ్గరకు చేరనిచ్చాడు. ప్రస్తుతం ఆ ఇద్దరినీ అభిమానంగానే చూసుకుంటున్నాడు కపూర్ బోయ్. శ్రీదేవి- బోనీల లవ్ స్టోరి ఆసక్తికరం. శ్రీదేవిని ప్రేమించి తనతో సినిమా చేయాలని బోనీ భావించారు. ఆ పరిచయమే ప్రేమగా మారి భార్య ఉండగానే రెండో పెళ్లికి దారి తీసింది. ``శ్రీదేవిని తొలిసారి పెద్ద తెరపై చూడగానే ప్రేమలో పడిపోయాను. తన కోసం చెన్నయ్ వెళ్లాను. ఛేజ్ చేశాను. తనతో ఓ సినిమా చేయాలని భావించాను. కానీ తను అప్పుడు చెన్నయ్ లో దొరకలేదు. తన వర్కింగ్ స్టైల్ చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాడిని`` అని బోనీ ఇదివరకూ న్యూదిల్లీలో జరిగిన శ్రీదేవి జయంతి కార్యక్రమాల్లో అన్నారు. శ్రీదేవి నాయికగా రూప్ కి రాణి చరోన్ కా రాజా, జుడాయి చిత్రాల్ని బోనీకపూర్ నిర్మించారు.