ఆదివారం తెల్లవారుజాము నుంచి నిన్న రాత్రి వరకూ అందరి నోటా శ్రీదేవే. ఇక.. టీవీలు ఆన్ చేసి న్యూస్ ఛానళ్లు ఓపెన్ చేస్తే చాలు.. శ్రీదేవి.. శ్రీదేవి.. శ్రీదేవి తప్ప మరింకేమీ పెద్ద ఫోకస్ కాలేదని చెప్పాలి. అన్ని ఛానళ్లు శ్రీదేవికే పెద్దపీట వేశాయి. ఆమె మరణం ఒక షాక్ గా మారితే.. ఆమె మరణానికి సంబంధించిన నివేదికలు ఆలస్యంగా రావటం.. అందుకు సంబంధించి వెలుగు చూసిన వార్తలు ఈ విషయాన్ని మరింత గందరగోళానికి గురి చేశాయి.
ఒకదశలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చివరకు దుబాయ్ ప్రభుత్వం కేసును క్లోజ్ చేస్తూ.. ఎలాంటి సందేహాలు లేవని తేల్చి చెప్పింది. దీంతో.. శ్రీదేవి మరణంపై నెలకొన్న సందేహాలకు పుల్ స్టాప్ పడ్డాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. శ్రీదేవి అంత్యక్రియలు ముగిసిన కొద్ది గంటల తర్వాత ఆమె ఖాతా నుంచి వెలువడిన ఒక ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
శ్రీదేవి తనకెంత ఆఫ్తురాలన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. తమ మధ్యనున్న అనుబంధాన్ని వివరిస్తూ శ్రీదేవి భర్త బోనీకపూర్ ఒక ట్వీట్ చేశారు. ఆమె ఈ ప్రపంచానికి చాందినీ.. నాకు మాత్రం ఆమే సర్వస్వం.. నా ప్రేమ.. నా స్నేహితురాలు.. భార్య.. ఇద్దరుకూతుళ్ల తల్లిని కోల్పోయాను. ఆమె లేని లోటు మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నారు.
శ్రీదేవి అంత్యక్రియలుపూర్తి అయిన తర్వాత ఆమె ట్విట్టర్ ఖాతా ఉంచి వెలువడిన తొలి ట్వీట్ గా దీన్ని చెప్పాలి.
వెండితెరపై శ్రీదేవి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుందని.. భౌతికంగా ఆమె మన మధ్యన లేకున్నా..ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లుగా బోనీ ట్వీట్ చేశారు.
శ్రీదేవి మిస్ అయిన వేళ.. కుటుంబంలోని పరిస్థితి గురించి అదే ట్వీట్ లో చెబుతూ.. ఈ బాధాకర సమయంలో అర్జున్ కపూర్.. అన్షులు నా వెంట నిలబడ్డారు. వారు నాకూ.. జాన్వికి.. ఖుషికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారన్నారు. తన ఇద్దరు కూతుళ్లను జాగ్రత్తగా చూసుకోవటమే తనకున్న ప్రథమ కర్తవ్యమన్నారు. శ్రీదేవి ఖాతానుంచి వెలువడిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావటమే కాదు.. పెద్ద ఎత్తున రీట్వీట్లు.. లైకులు నమోదవుతున్నాయి.