శ్రీవారి సేవలో బాధగా జాహ్నవి కపూర్

Update: 2018-07-08 10:43 GMT
కొన్ని నెలల కిందటే అతిలోక సుందరి శ్రీదేవి మనల్ని విడిచి వెళ్లిపోయింది. దుబాయ్ లో అర్ధాంతరంగా తనువు చాలించింది. ఆమె మరణం దేశవ్యాప్తంగా అభిమానులను కలిచివేసింది. శ్రీదేవి కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

తాజాగా శ్రీదేవి భర్త బోనీకపూర్ తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.ఉదయం బోనీ, ఇద్దరు కుమార్తెలు శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు. అతిలోక సుందరి ఇటీవల తిరిగిరాని లోకాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ ఎప్పుడు తిరుమలకు వచ్చినా శ్రీదేవి, కుమార్తెలతో కలిసి వచ్చేవారు. అయితే ఈసారి మాత్రం శ్రీదేవి లేని లోటు ఆయనలో స్పష్టం కనిపించింది. బోనీ చాలా బాధగా కనిపించారు. ఆయన కుమార్తెలు జాహ్నవి - కుషీలలో మోములో కూడా నవ్వు కనిపించలేదు.

టీటీడీ అధికారులు బోనీకపూర్ కు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కుమార్తెలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బోనీ ఫ్యామిలీని చూడడానికి , సెల్ఫీల కోసం జనం ఎగబడ్డారు.

శ్రీదేవికి తిరుమల రావడం సెంటిమెంట్.. ఆమె ఏ పని మొదలుపెట్టాలన్నా శ్రీవారి చెంతకు వస్తుండేది. శ్రీవారి ఆశీస్సులతోనే తాను ఇంతలా ఎదిగానని చెప్పుకొచ్చేది. ఇప్పుడు శ్రీదేవి లేకపోవడంతో బోనీ, ఆమె కూతుళ్లు ముభావంగా కనిపించారు.
Tags:    

Similar News