శ్రీదేవి మరణం ముందు వరకు బోనీ ప్రపంచం అతని భార్య ఇద్దరు పిల్లలు జాహ్నవి ఖుషీ మాత్రమే. మొదటి భార్యకు పుట్టిన పిల్లలు ఇద్దరున్నా వారు బోనీ కుటుంబంతో కలిసేవారు కాదు. తన తల్లికి అన్యాయం చేసి ఆ స్థానంలోకి శ్రీదేవి వచ్చిందని మొదటి భార్య పిల్లలు అర్జున్ కపూర్ అన్షులాకు ఏ మూలనో కోపం ఉండేది. అందుకే శ్రీదేవితో కానీ ఆమె కూతుళ్లతో కానీ అర్జున్ కపూర్ అన్షులా మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బోనీ కపూర్ అతని నలుగురు పిల్లలు ఒక్కటిగా బతుకుతున్నారు.
పైనున్న ఫోటో చూస్తేనే అర్థమైపోతుంది. బోనీ అతని నలుగురు పిల్లలు ఎంతలా కలిసిపోయారో. రెండునెలల క్రితం వరకు వారంతా పరిచయం లేని వారిలో ఉన్నారు. ఫిబ్రవరి 24ప దుబాయ్‌లో శ్రీదేవి మరణం ఆ పిల్లలను తండ్రిని దగ్గర చేసింది. అర్జున్ శ్రీదేవి ఇంటికి వెళ్లి మరీ ఒంటరిగా ఉన్న తన చెల్లి జాహ్నవిని ఓదార్చాడు. తండ్రికి తోడుగా ఉన్నాడు. అన్షులా కూడా తల్లిని పోగొట్టుకున్న చెల్లెళ్లకు అండగా నిలిచింది. వారిని విమర్శిస్తున్న నెటిజన్లపై ఘాటుగా స్పందించింది. శ్రీదేవి మరణం వారిని ఇంతలా దగ్గర చేసింది. అర్జున్ కు తన తల్లి స్థానాన్ని లాక్కున్న శ్రీదేవి మీదే కోపం ఉందని తండ్రి బోనీపైనా చెల్లెళ్లు జాహ్నవి ఖుషీ లంటే ఇష్టమేనని నిరూపించాడు. గతంలో కూడా ఈ కుర్ర హీరో చాలా సార్లు అతిలోక సుందరిని విమర్శిస్తూనే వచ్చాడు.
సోనమ్ కపూర్ పెళ్లిలో బోనీ తన ముగ్గురు కూతుళ్లు కొడుకుతో ఆనందంగా గడిపాడు. నలుగురు పిల్లలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అన్షులా ప్రేమగా జాహ్నవిని పట్టుకుంటే అర్జున్ ఖుషీని పట్టుకుని ఫోటో తీయించుకున్నాడు. ఆ పెళ్లిలో వధూవరులు తరువాత వీరే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయ్. శ్రీదేవి అభిమానులకు కనువిందు చేస్తున్నాయ్.