సాంగ్ టాక్: 'స్పై'డర్ భూమ్ భూమ్

Update: 2017-08-02 16:43 GMT
మహేష్‌ బాబు లేటెస్ట్ మూవీ 'స్పైడర్'ను అసలు ఏ.ఆర్.మురుగుదాస్ ఎంత ఛాలింజింగ్ గా రూపొందిస్తున్నాడు మొన్నటివరకు ఎవ్వరికీ అర్ధంకాలేదు. కాని ఇప్పుడు రిలీజ్ చేసిన ఒక పాటను చూస్తుంటే.. ఖచ్చితంగా ఈ సినిమా రేంజును అంచనా వేసేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే జేమ్స్ బాండ్ సినిమా లైసన్సు తీసుకుని ఇండియాలో ఒకటి రూపొందిస్తే ఎలా ఉంటుంది? సేమ్ అలాంటి టచ్చింగే ఇచ్చాడు మురుగుదాస్.

'బూమ్ బూమ్' అంటూ సాగే ఒక పాటను రిలీజ్ చేశారు స్పైడర్ టీమ్. ఐదింటి నుండి ఎనిమిదిన్నర వరకు వాయిదాలు వేయడంతో ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారేమో కాని.. పాటతో పాటు రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో చూశాక మాత్రం పిచ్చెత్తిపోయిందంతే. మహేష్‌ బాబు ఈ సినిమాలో ఒక గూఢచారి (స్పై) అంటూ పూర్తిస్తాయి హింట్లు ఇచ్చేశారు. మొత్తంగా లిరిక్స్ చూస్తే చెప్పాల్సినదంతా క్లియర్ చెప్పేశాడు మురుగ. ఇకపోతే ఈ ఇంట్రడక్షన్ సాంగ్ ను ఒక అమ్మాయితో పాడించి భలే ప్రయోగం చేశాడు హారిస్ జయరాజ్. అలాగే ఈ పాటను సంతోష్‌ శివన్ తన స్టయిల్లో తీస్తుంటే.. పాటంతా కూడా బ్లాక్ అండ్ వైట్.. కమ్ సిల్వర్ థీమ్ ఉండేలా భలే ఆర్ట్ వర్క్ చేశారు.

ఇక లిరిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే.. ''మార్కెల్ కామిక్స్ ఇతన్ని చూసి రాశారేమో.. హాగ్వార్ట్స్ ఇతను పట్టాగాని పొందాడేమో'' అంటూ రామజోగయ్య శాస్ర్తి రాసిన లిరిక్స్ బి-సి సెంటర్లలో అర్ధంకావేమో కాని.. యాక్షన్ హీరోలను తయారు చేసిన మార్వెల్ కామిక్స్ ను చదివేవారు.. అలాగే హ్యారీ పోటర్ నవలల్లోని హాగ్వార్ట్స్ స్కూల్ ఆఫ్ మ్యాజిక్ ను ఇష్టపడేవారు.. ఇలాంటి లిరిక్స్ కు భలే కనక్ట్ అవుతారు. భూమ్ భూమ్ బామ్ బామ్ భూకంపాల శబ్దమే!!!

ఇదే సమయంలోమనం ఓవర్సీస్ రైట్స్ గురించి చెప్పుకోవాలంటే.. మహేష్‌ బాబు 'స్పైడర్' మేకర్లు సినిమాను 15.5 కోట్ల రూపాయలకు అమ్మేశారు. తమిళ్ మరియు తెలుగు వర్షన్ రైట్లను కలిపి ఈ మొత్తానికి అమ్మేశారు. అంటే రెండు వర్షన్లు కలిపి 3.5 మిలియన్ డాలర్స్ వస్తేనే ఈ డిస్ర్టిబ్యూటర్లు గట్టెక్కుతారు. అది సంగతి.


Full View
Tags:    

Similar News