రెండేళ్ల విరామం తరువాత అల్లు శిరీష్ నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ `ఊర్వశివో రాక్షసివో`. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన `ఏబీసీడీ : అమెరికన్ రిటర్న్ కన్ఫ్యూజ్డ్ దేసీ` మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన `ఏబీసీడీ` మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శిరీష్ ఈ మూవీ తరువాత దాదాపు మూడేళ్ల తరువాత రొమాంటిక్ లవ్ స్టోరీ `ఊర్వశివో రాక్షసివో`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. `విజేత` ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ ని ప్రారంభించేశారు.
ఈ సందర్భంగా తను హీరోయిన్ అనుఇమ్మాన్యుయేల్ తో డేటింగ్ లో వున్నానంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ లో శిరీష్ - అను ఇమ్మాన్యుయేల్ రెచ్చిపోయి రొమాంటిక్ సన్నివేశాల్లో ఆకట్టుకునే కెమిస్ట్రీతో కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని, ఇద్దరూ డేటింగ్ లో వున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై అల్లు శిరీష్ మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు.
నటీనటుల జీవితాల్లో ఇలాంటి వదంతులు సర్వసాధారణం. కోస్టార్ తో తాను ప్రేమలో వున్నట్టు వార్తలు రావడం సహజమే. గతంలోనూ నా గురించి ఇలాంటి వార్తలే వచ్చాయి. నిజం చెప్పాలంటే మా ఇద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం.
కొన్ని నెలల పాలు కలిసి పని చేశాం కాబట్టి మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అదీకాక తను చాలా సైలెంట్. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా వుంటాయి. దాని వల్ల మేమిద్దరం ఎక్కవగా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడింది.
వర్క్ విషయంలో తను చాలా ప్రొఫెషనల్ గా వుంటుంది. అందువల్లే రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఇబ్బందిపడలేదు. ఆన్ లైన్ లో కామెంట్ లు చూసినప్పుడే నెగిటివిటీని ఎక్కువగా ఫీలవుతాం. అందుకే రెండేళ్ల నుంచి సోషల్ మీడియాకు దూరంగా వుంటున్నా. నేనే కాదు మిగతా నటులు కూడా సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాకు, ఆన్ లైన్ కు దూరంగా వుంటున్నారు` అని స్పష్టం చేశాడు అల్లు శిరీష్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.