కన్నడ చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1` అన్ని ప్రధాన భాషల్లో రిలీజై ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. దీనికి సీక్వెల్ కాని కొత్త కథతో వస్తున్న `కేజీఎఫ్ చాప్టర్ 2` అంతకు మించి సంచలనాలు సృష్టిస్తుందా? అంటే ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రేడ్ వర్గాల్లో పలు ఆసక్తికర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో థియేటర్ కి రావాలంటే సగటు ప్రేక్షకుడికి ఎలాంటి భయాలు లేవు. నచ్చిన సినిమా క్రేజీ సినిమాని చూడ్డానికి భారీ స్థాయిలో థియేటర్లకొచ్చేవారు. ఒకటికి రెండుసార్లు సినిమాలు చూసేవాళ్లతో బాక్సాఫీస్ కళకళలాడేది.
కానీ కరోనా తరువాత పరిస్థితి మారింది. ఈ క్రైసిస్ పిరియాడ్ లో సగటు ప్రేక్షకుడు థియేటర్ కు రావాలంటే చాలా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎనిమిది నెలలుగా వైరస్ వైరస్ అన్న మాటలు విని జనం చాలా భయంతో వణికిపోయారు. ఇప్పుడిప్పుడే కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చేస్తోందని.. త్వరలోనే పంపిణీ మొదలుపెడతామని స్వయంగా ప్రధాని చెప్పడంతో దైనందిన కార్యక్రమాలు జోరందుకున్నాయి. అయితే వినోదానికి పెద్ద పీట వేస్తారా? అన్నదే ఇప్పుడున్న ప్రశ్న.
ఎప్పటిలాగే జనం భయంవీడి వినోదం కోసం థియేటర్ల బాటపడితే `కేజీఎఫ్ చాప్టర్ 2` వసూళ్ల పరంగా అద్భుతాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 4న హాలీవుడ్ చిత్రం `టెనెట్`తో మల్టీప్లెక్స్ లు రీఓపెన్ అయ్యాయి. కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే ఆశజనకంగానే వుంది. ఇదే నిజమైతే రానున్న రోజుల్లో థియేటర్స్ వ్యవస్థ మరింత పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే రాఖీభాయ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమే.
త్వరలో అంటే జనవరి 8న యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. `బాహుబలి` తరువాత ఆ స్థాయిలో ప్రభావాన్ని కలిగించిన యష్ చాప్టర్ 2 తో ఆ క్రేజ్‌ని కొనసాగించి ప్రభాస్ తర్వాత సౌత్ లో అంతటి వాడని నిరూపిస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే. ఈ మూవీ ఇచ్చే వసూళ్ల బలం తదుపరి రిలీజ్ కి సిద్ధమవుతున్న రాజమౌళి `ఆర్.ఆర్.ఆర్` కి ఊపునిస్తుంది. `కేజీఎఫ్ చాప్టర్ 2` బాక్సాఫీస్ వసూళ్లు చూపించే ప్రభావం ఎలా వుంటుందోనని రాజమౌళి కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుత క్రైసిస్ సందర్భంగా పాన్ ఇండియా సినిమాల భవితవ్యంపై ట్రేడ్ లో ఆసక్తికర రివ్యూలు చోటు చేసుకున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.