'బ్ర‌హ్మాస్ర్త'కి బోయ్ క‌ట్ సెగ‌..టీమ్ గుండెల్లో రైళ్లు!

Update: 2022-08-31 11:31 GMT
'బోయ్ క‌ట్' అనే ప‌దం వింట‌నే  బాలీవుడ్ బెంబేలెత్తిపోతున్న సంగ‌తి తెలిసిందే. కోవిడ్ పాండ‌మిక్ ని మించిన భ‌యాన్ని ఇప్పుడు బోయ్ క‌ట్ బాలీవుడ్ గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తుంది. పొర పాటున ఏ హీరో అయినా నోరు జారాడా?  ఆ సినిమా  కిల్ అయిన‌ట్లే. క‌నీసం ఓపెనింగ్స్ కి కూడా  లేకుండా డిజాస్ట‌ర్  చిత్రాలుగా మారుతున్నాయి.

ఇటీవ‌ల రిలీజ్ అయిన లాల్ సింగ్ చ‌డ్డా..లైగ‌ర్ చిత్రాలు బోయ్ క‌ట్ దెబ్బ‌కి బ‌లైన‌వే. నోరు జార‌క‌పోయుంటే సినిమాకి  క‌నీసం మంచి ఓపెనింగ్స్ అయినా ద‌క్కేవి. అవి కూడా లేకుండా రెండు సినిమాలు నిష్ర్క‌మించాల్సి వ‌చ్చింది. సినిమాకి మంచి రివ్యూస్ వ‌చ్చినా...కాస్తా..కూస్తో న‌డివ‌చేవి. అదీ లేక‌పోవ‌డంతో పూర్తిగా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది.

తాజాగా బ్ర‌హ్మ‌స్ర్త పై  సైతం బోయ్ క‌ట్ ప్ర‌భావం ప‌డింది. ఇందులో జంట‌గా న‌టించిన ర‌ణ‌బీర్ క‌పూర్..అలియాభ‌ట్ ఇండస్ర్టీ బిడ్డ‌లు. ఇద్ద‌రు స్టార్ కిడ్స్ . నెపో కిడ్స్ గా ఫేమ‌స్. అందుకే ఇప్పుడు బ్ర‌హ్మాస్ర్త‌ని బోయ్ క‌ట్ చేయాలంటూ కొంత మంది నెటి జ‌నులు సోష‌ల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. పైగా ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్ నిర్మించ‌డం మ‌రింత వ్య‌తిరేక‌త‌కు దారి తీస్తున్న‌ట్లు తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి తెలుస్తోంది.

'తన సినిమా చూడాలనుకునేవాళ్లు థియేటర్లకు వస్తారని.. మిగతా వాటి గురించి పట్టించుకోనని' అలియా  పాత ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్య‌ల్ని త‌వ్వి బ‌ట‌య‌కు తీస్తున్నారు  నెటిజన్లు. మరొక పాత ఇంటర్వ్యూలో ఆమె ''భారతదేశ అధ్యక్షుడి పేరును గుర్తుంచుకోవలసిన అవసరం లేదని చెప్పింది''. ఇప్పుడీ భామ వీడియోల్ని  బాయ్‌కాట్ గ్యాంగ్ బ‌య‌ట‌కు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

బాలీవుడ్ యువ న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ నెపొటిజం కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య‌కు  చేసుకున్నాడని  గ‌తంలో వైర‌ల్ అయిన మీడియా క‌థ‌నాల్ని  మ‌ళ్లీ గుర్తు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా  బ్ర‌హ్మాస్ర్త‌ని  ఎవ‌రూ చూడవద్దని ప్రేక్ష‌కుల్ని బోయ్ క‌ట్ గ్యాంగ్  అభ్య‌ర్ధిస్తుంది. మ‌రి సినిమాపై ఈ ఎఫెక్ట్ ఎంత వ‌ర‌కూ ప‌డుతుందో చూడాలి. సెప్టెంబ‌ర్ 9న బ్ర‌హ్మాస్ర్త రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News