బోయపాటి ఫుల్లుగా దట్టించేశారుగా...?

Update: 2021-11-15 23:30 GMT
టాలీవుడ్ లో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ఆ విధంగా చూస్తే బోయపాటి శ్రీను ది పక్కా ఊర మాస్ మేకింగ్. ఆయన సినీ కెరీర్ రెండు దశాబ్దాలు దాటింది. మరి ఈ సుదీర్ఘ కాలంలో ఆయన తీసిన సినిమాలు అఖండతో కలిపి తొమ్మిది అంటే ఆశ్చర్యం కలగకమానదు.

అయితే ఇందులో అయిదు బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అఖండ కూడా ఘన విజయం సాధిస్తే బోయపాటి సక్సెస్ స్కోర్ ఇంకా పెరుగుతుంది. మొత్తానికి స్టడీగా బోయపాటి ముందుకు వెళ్తున్నారు అనుకోవాలి.

అంతే కాదు బోయపాటి తొలి సినిమా భద్ర నుంచి చూసుకుంటే ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగానే సీన్ ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ లో బోయపాటి అలనాటి డైరెక్టర్ బీ గోపాల్ నే మించేశారు అన్న టాక్ కూడా ఉంది.

ఆయన భారీ డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్స్ ని రంగరించి తీసిన సినిమాలు విజయాన్ని అందుకున్నాయి సింహా, లెజెండ్ ఆ కోవకు చెందినవే. ఇపుడు అఖండ కు కూడా అదే ఫార్ములను నమ్ముకున్నట్లుగా ట్రైలర్ ని చూస్తే అర్ధమవుతుంది.

బోయపాటి బాలయ్య అంటేనే నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. దాంతో అఖండలో ఇంకా యాక్షన్ సీన్లు దట్టించేశారు అంటున్నారు. బోయపాటి సింహా 2010లో వస్తే లెజెండ్ 2014లో రిలీజ్ అయింది. సరిగ్గా ఏడేళ్ల తరువాత అఖండ వస్తోంది.

మరి కాలం మారింది. ట్రెండ్ మారుతోంది. టెఖానలజీ కూడా మారుతోంది. బోయపాటి రోటీన్ యాక్షన్ అయితే మాత్రం ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. కంటెంట్ కి అట్రాక్ట్ అయి మూవీస్ ని చూసే ఆడియన్స్ పెరిగిన రోజులలో అఖండ వంటి భారీతనంతో కూడిన సినిమా అంటే బోయపాటి తన ఫార్ములాతో రిస్క్ చేస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది.

ఏది ఏమైనా బోయపాటికి బాలయ్య మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ మీద కంప్లీట్ గా అవగాహన ఉంది. దాంతో పాటు బాలయ్యలోని ఫుల్ ఎనర్జీ లెవెల్స్ ని ఎలా వాడుకోవాలో తెలిసిన దిట్ట. మొత్తానికి బోయపాటి బాలయ్య కలసి చేసే మ్యాజిక్ ఎపుడూ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అదే ధీమాతో అఖండ ను కూడా బ్రహ్మాండంగా రెడీ చేసి వదులుతున్నారు. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అయి టాలీవుడ్ కి కొత్త ఊపిరులు అద్దాలని అంతా కోరుకుంటున్నారు.
Tags:    

Similar News