బోయపాటికి బుల్లి లెజెండ్ పుట్టాడు

Update: 2017-04-03 04:15 GMT
బోయపాటి శ్రీనుకు పుత్రోత్సాహం కలిగింది. ఇవాళ అంటే ఏప్రిల్ 2.. ఆదివారం ఉదయం బోయపాటి శ్రీను భార్య విలేఖ.. మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉండగా.. ఇప్పుడు బోయపాటి ఇంట బోలెడంత సంతోషం వెల్లివిరుస్తోంది.

ఇప్పటికే ఈ దర్శకుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి హర్షిత్.. అమ్మాయి జోషితలు. ఇప్పడు మూడో చిన్నారిగా బుల్లి లెజెండ్ పుట్టాడన్న మాట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బోయపాటి శ్రీను కూడా ఏప్రిల్ లోనే పుట్టాడు. ఏప్రిల్ 25 ఈ డైరెక్టర్ పుట్టిన రోజు కాగా.. అదే నెలలో ఇప్పుడు ఓ చిన్నారి జన్మించడంతో.. ఏప్రిల్ నెల ఈ దర్శకుడి ఫ్యామిలీలో సంతోషం రెట్టింపయింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. వరుస బ్లాక్ బస్టర్లతో ఊపు మీదున్న బోయపాటి.. గతేడాది అల్లు అర్జున్ తో సరైనోడు చిత్రం తీసి.. ఇండస్ట్రీ హిట్ కూడా సాధించాడు. తన తర్వాతి ప్రాజెక్టు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ముందుగా ఇచ్చిన కమిట్మెంట్ కు కట్టుబడి ఉన్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందనుండగా.. ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి.. రీసెంట్ గానే షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం హైద్రాబాద్ శివార్లలో హీరో ఇంట్రడక్షన్ సీన్ కి సంబంధించి.. భారీ ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా ఖాయం చేయగా.. శృతి హాసన్ తో ఐటెం సాంగ్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News