రాజమండ్రి అశేష జనవాహినితో కిటకిటలాడిపోతోంది. గోదావరి తీరం అలల తాకిడి కంటే మనిషి తాకిడితోనే అల్లాడిపోతోంది. ఇదంతా పుష్కరాల మహిమ. అయితే జనాలు ఇంతగా విచ్చేస్తున్నా.. పుష్కరాల్లో రొటీనిటీ తప్ప కొత్తగా ఏం లేదన్న విమర్శలొస్తున్నాయి. ఇది గ్రహించిన ఏపీ ప్రభుత్వం ఓ కొత్త ఆలోచన చేసింది.
వారణాసి గంగా హారతి తరహాలోనే గోదావరిలోనూ నిత్య హారతిని నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అంతే వెంటనే ఈ అదనపు హంగుని ప్రవేశపెట్టింది. అయితే 'గోదారిలో నిత్య హారతి' అన్న కాన్సెప్టు జనాలకు చేరక ఎవరూ దానిని పట్టించుకోలేదు. దాంతో చంద్రబాబు స్వయంగా సినీగ్లామర్‌ని రంగంలోకి దించారని తెలుస్తోంది. సింహా, లెజెండ్ వంటి సినిమాలతో బాలయ్యబాబుకు బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీనుని రంగంలోకి దించారు. గోదారిలో నిత్య హారతికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అది విజయవంతమయ్యేలా సరైన ప్రచారం తేవాలని బాబు కోరినట్టు తెలుస్తోంది. దీనికి బోయపాటి సైతం సై అన్నాడని చెబుతున్నారు. ఏదేమైనా పుష్కర స్నానాల్లో సినీ గ్లామర్‌తో ప్రచారం పీక్స్‌కి వెళుతోందనడానికి ఇదో నిదర్శనం.