దర్శకుడిగా తనకంటూ ఒక ఇమేజ్ ఉందని.. తాను ఎవరితో సినిమా చేశానని చూడకుండా ఫ్యాన్సీ రేట్లతో సినిమాను కొనేసే బయ్యర్లు తనకున్నారని.. తాను ఏ సినిమా చేసినా వాళ్లను దృష్టిలో పెట్టుకునే చేస్తానని అంటున్నాడు బోయపాటి శ్రీను. ‘జయ జానకి నాయక’ సినిమాను బోయపాటి శ్రీను లాంటి అప్ కమింగ్ హీరోతో చేసినప్పటికీ.. ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందంటే.. అది బయ్యర్లు తన మీద పెట్టుకున్న నమ్మకం వల్లే అని బోయపాటి అన్నాడు. తనకు బయ్యర్లు.. నిర్మాతల క్షేమమే ముఖ్యమని అతనన్నాడు.
‘‘జయ జానకి నాయక సినిమాకు బడ్జెట్ ఎక్కువే పెట్టిన మాట వాస్తవమే. ఐతే నేను చిన్న హీరోతో చేస్తున్న మాత్రాన తగ్గి సినిమా చేసే రకం కాదు. ఎవరితో సినిమా చేసినా అది నా స్థాయిలోనే ఉంటుంది. ఎందుకంటే నా సినిమా అంటే ఒక అంచనాలు పెట్టుకునే ప్రేక్షకులున్నారు. అలాగే నా సినిమాకు కొబ్బరికాయ కొట్టానంటే చాలు.. మంచి రేట్లకు సినిమాను కొనేసే బయ్యర్లు ఉన్నారు.
‘జయ జానకి నాయక’ విషయంలోనూ అదే జరిగింది. వాళ్లందరినీ దృష్టిలో పెట్టుకునే సినిమా చేస్తా. తగ్గే ప్రసక్తే లేదు. ‘జయ జానకి నాయక’కు బడ్జెట్ ఎక్కువైనా సరే.. అందుకు తగ్గట్లుగా బిజినెస్ జరిగింది. నా మీద బయ్యర్లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. నా నిర్మాత.. నా బయ్యర్లు బాగుంటేనే నేను బాగుంటాను. వాళ్లకు అన్యాయం జరిగితే నేను సినిమాలే చేయను. నేను నా ప్రతి సినిమాకూ చాలా గ్యాప్ తీసుకుని.. ఎక్కువ రోజులు వర్క్ చేసేది వాళ్లను దృష్టిలో పెట్టుకునే’’ అని బోయపాటి అన్నాడు.