బోయపాటి గట్టిగానే కట్టాడండీ..

Update: 2018-04-06 17:28 GMT
టాలీవుడ్ లో గత కొంత కాలంగా కమర్షియల్ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్న దర్శకుల్లో బోయపాటి ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. మాస్ ఆడియెన్స్ పల్స్ తెలిసిన ఈ దర్శకుడు ఎలాంటి హీరోనైనా చాలా రాయల్ గా చూపించగలడు. ముఖ్యంగా సరైనోడు సినిమాతో మనోడి స్థాయి మారిపోయింది. రెమ్యునరేషన్ లో అంకెలు కూడా రేంజ్ కి తగ్గట్టు పెరిగాయి. దీంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి అనే ఫార్ములాను బోయపాటి బాగా వాడారు.

రెమ్యునరేషన్ ఉన్నప్పుడే లైఫ్ ని సేఫ్ జోన్ లో ఉంచుకోవాలని ఒక గట్టి ఇల్లును రెడీ చేయించుకున్నాడు. మొత్తం తన టెస్ట్ కి తగ్గట్టు బోయపాటి శ్రీను కొండాపూర్ లో గత కొంత కాలంగా ఇంటిని రెడీ చేయిస్తున్నాడు. అయితే దాదాపు ఆ ఇంటిపని ఇటీవల అయిపోయిందట. 7 కోట్లతో నిర్మించినట్లు తెలుస్తోంది. ఇటీవల గుమ్మడి కాయ కొట్టేసి ఇంట్లోకి అడుగుపెట్టారు. బోయపాటి తన కెరీర్ లో ఎక్కువగా పరాజయానలను చూడలేదు. ఒక వేళ అది వేస్తే వెంటనే మరో బాక్స్ ఆఫీస్ హిట్ తో తరిమి కొట్టేవాడు.

ఇక చివరగా జయ జానకి నాయక సినిమాతో అంతగా హిట్ అందుకోలోని బోయపాటి ఈ సారి మాత్రం మరోసారి తన టాలెంట్ ని చూపించాలని అనుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్టును లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News